BRS Resigned : ఖమ్మం జిల్లాలో ఆసక్తికర పరిణామం.. ఆ నేత కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్‌కు బిగ్ ఝలక్.. పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసిన నేతలు
ABN, First Publish Date - 2023-09-22T16:35:35+05:30
ఖమ్మం జిల్లాలో(Khammam district) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఖమ్మం రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్(Congress)లో తుమ్మల చేరడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. పాలేరు టికెట్(Plaier ticket) ఆశిస్తూ తుమ్మల కాంగ్రెస్‌లో చేరగా.. ఆయనకు అధిష్ఠానం నుంచి హామీ కూడా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో(Khammam district) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఖమ్మం రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్(Congress)లో తుమ్మల చేరడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. పాలేరు టికెట్(Palair ticket) ఆశిస్తూ తుమ్మల కాంగ్రెస్‌లో చేరగా.. ఆయనకు అధిష్ఠానం నుంచి హామీ కూడా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా గతంలో ఆయనతో పాటే ఉన్న నేతలు కాంగ్రెస్‌లోకి వెళ్లాక కూడా తనతో పాటే పార్టీ మారేందుకు సిద్ధం మయ్యారు.ఈ క్రమంలో గతంలో ఆయనతో ఉన్న నేతలు బీఆర్ఎస్(BRS)కు బిగ్ ఝలక్ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి సీఎం కేసీఆర్(CM KCR)ని హెచ్చరించారు.
పాలేరు నియోజకవర్గంలోని.. నేలకొండపల్లి, కూసుమంచి, తిర్మాలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాలకు చెందిన నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మాజీ. తాజా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబెర్స్, మాజీ పార్టీ మండలాధ్యక్షులు, మాజీ మార్కెట్ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ప్రకటించారు. తుమ్మలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరతామంటూ స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తుమ్మల వెంటే ఉంటామని మూకుమ్మడి ప్రకటించారు. పాలేరులో తుమ్మల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారని, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల బాగోగులు పట్టించుకుంటారని ఆనేతలు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఏర్పడిన పరిణామంతో బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడిపోయింది.
బీఆర్ఎస్ నేతల మూకుమ్మడి రాజీనామాలతో ఖమ్మం జిల్లా రాజకీయాలు అనూహ్య మార్పు తీసుకోనున్నాయి. కాగా.. ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న రాయల నాగేశ్వరరావు, తదితరులకు పార్టీ నాయకత్వం ప్రత్యామ్నాయంపై భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు కోసం దరఖాస్తులు చేయగా.. సీపీఐతో పొత్తు కుదరని పక్షంలో కొత్తగూడెం బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. తుమ్మల మాత్రం తొలినుంచి పాలేరు టిక్కెట్ హామీ పైనే కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమ్మల బలమైన అభ్యర్థి కూడా. పాలేరు నేతలే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తుమ్మలకు ఖమ్మం జిల్లా అభివృద్ధిలో మంచి పేరుంది. రాజకీయ చదరంగంలో తుమ్మలకు ఉన్న అనుభవం కూడా కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను చక్రం తిప్పడంలో తుమ్మల సిద్ధహస్తులు. తుమ్మల నాగేశ్వరరావుకు బలమైన క్యాడర్ కూడా ఉంది. మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో టీడీపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించిన తుమ్మల.. అభివృద్ధి పనులపైనే ప్రధానంగా దృష్టి పెట్టి జిల్లాపై తనదైన ముద్ర వేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో తుమ్మల నాగేశ్వరరావు ప్రభావంతో కాంగ్రెస్‌కు మరిన్నీ సీట్లు పెరగవచ్చని కాంగ్రెస్ అధిష్ఠానం అంచనా వేస్తోంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణంలోని కమ్మ సామాజిక వర్గ ఓట్లను కూడా తుమ్మల ప్రభావితం చేసే అవకాశాలు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ ఆ సామాజిక వర్గంలోని ఓట్లను కోల్పోయే ప్రమాదముంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే పొంగులేటి రూపంలో బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ తగులుతుండగా.. ఇప్పుడు తుమ్మల కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలహీన పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈసారి కూడా గతంలో లాగానే కాంగ్రెస్‌కు ఖమ్మం కంచుకోటగా నిలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
Updated Date - 2023-09-22T16:48:33+05:30 IST