ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indrasena Reddy: రేవంత్‌రెడ్డిపై నూతన గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-10-19T12:33:23+05:30

త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన నల్లు ఇంద్రసేనారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఇంద్రసేనారెడ్డి ఫైర్ అయ్యారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారన్నారు.

హైదరాబాద్: త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన నల్లు ఇంద్రసేనారెడ్డి (Tripura's new governor Indrasena Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై (TPCC Chief Revanth reddy) ఇంద్రసేనారెడ్డి ఫైర్ అయ్యారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారన్నారు. గురువారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. రెడ్డినైన తనకు గవర్నర్ పదవి వచ్చిందనందుకు రేవంత్ రెడ్డి బాధ పడిపోతున్నారని మండిపడ్డారు. ఎంతసేపూ ఇతరులను ఇరకాటంలో పెట్టడమే రేవంత్ రెడ్డి పని అంటూ వ్యాఖ్యలు చేశారు. సొసైటీని డివైడ్ చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్ ఓపెన్‌గా అనేకసార్లు చెప్పారన్నారు. మోదీ స్వయంగా ఫోన్ చేసి త్రిపుర గవర్నర్‌గా నియమిస్తున్నట్లు చెప్పారని.. తన సిన్సియారిటీ గురించి ఏపీ, తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ఎవరు పనితీరు ఏంటో మోదీకి తెలుసన్నారు. ఎప్పుడు ఎవరకి ఏ బాధ్యతలు ఇవ్చాలో వారికి తెలుసని చెప్పుకొచ్చారు. గతంతో పోల్చితే మోదీ హాయాంలో ఈశాన్య రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయని నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.


ఇంద్రసేనారెడ్డి నియామకాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్

కాగా.. త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి నియామకంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. సీఈసీ రాజీవ్ కుమార్‌కు పీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడి వ్యక్తిని త్రిపుర గవర్నర్‌గా నియమించడం సరికాదని కాంగ్రెస్ పేర్కొంది. ఇది ఓటర్లను ప్రభావితం చేసే చర్య అని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకాన్ని నిలిపివేయాలని సీఈసీని కాంగ్రెస్ పార్టీ కోరింది.

Updated Date - 2023-10-19T12:33:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising