ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: రేవంత్‌రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

ABN, First Publish Date - 2023-06-02T15:26:01+05:30

డబ్బులు పంచడం నాకు చేతకాదు. రేవంత్ రెడ్డి పార్టీ ఎలా నడుపుతున్నారో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అడిగితే

Bandi Sanjay
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రేవంత్ రెడ్డి లాగా పార్టీలు మారడం తనకు చేతకాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘‘ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం నాకు చేతకాదు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్టీ ఎలా నడుపుతున్నారో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అడిగితే తెలుస్తుంది. కాంగ్రెస్ ఎవరి చెప్పుచేతల్లో ఉందో. హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాం. పార్టీ నడపరాకుంటే ఎలా గెలుస్తాం. గెలుపు పరంపర కొనసాగిస్తున్నాం.. కాంగ్రెసోళ్లు ఓటమి పరంపర సాగిస్తున్నారు. వాళ్లు డిపాజిట్లు కోల్పోయిన పరంపర సాగుతోంది. మా దగ్గర సీనియర్లు బాస్‌లు.. అదే కాంగ్రెస్‌లో హోంగార్డులు. సొంత పార్టీ నేతలపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం నాకు చేతకాదు. బీజేపీ పార్టీ ఎక్కడుందో వాళ్ల అయ్యను కేటీఆర్ (KTR) అడగాలే. బీఆర్ఎస్ ఉందో.. బీజేపీ ఉందో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాధానం చెప్పారు. మాది కుటుంబ పార్టీ కాదు.. అయ్య పేరు చెప్పి కూతురు, కొడుకు సీఎంలు అయ్యే పార్టీ మాది కాదు. ముసుగులు వేసుకుని తిరిగే పార్టీ మాది కాదు. అయ్య లేకుంటే బిడ్డ, బిడ్డ లేకుంటే కొడుకు సీఎం అయ్యే పార్టీ మాది కాదు. ఓవైసీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదు. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. ఎంఐఎం పార్టీని నిజమైన తెలంగాణ ముస్లింలు వ్యతిరేకించాలి. తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగురవేయనోడికి తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదు. జెండా ఎగురవేయనందుకు కేసీఆర్‌కు దమ్ముంటే దారుస్సలాంకు తాళం వేయాలి. ఆర్నెళ్లలో మేము అధికారంలోకి వచ్చాక దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు ఇచ్చేస్తాం. 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాం. తెలంగాణ ఆవిర్భవాన్ని కూడా అధికారికంగా నిర్వహించాం. క్రెడిట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిర్వహించేలా చేశారు.’’ అంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Woman Kisses Snake: ఈ యువతి ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిపోయింది.. పామును ముద్దు పెట్టుకున్న మరుక్షణంలోనే..!

Updated Date - 2023-06-02T15:28:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising