ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy: విమోచన దినోత్సవ వేడుకకు కేసీఆర్ రావాల్సిందే

ABN, First Publish Date - 2023-09-09T12:29:25+05:30

బీఆర్ఎస్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: బీఆర్ఎస్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘విమోచన దినోత్సవం జరపకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కేసీఆర్.. విమోచన దినోత్సవం జరపాలని గతంలో కాంగ్రెస్‌ను నిలదీసిన కేసిఆర్.. నేడు ఎందుకు విమోచన దినోత్సవం వేడుకలు నిర్వహించడం లేదు’’ అంటూ ప్రశ్నించారు. కేంద్రం అధీనంలో ఈ ఏడాది కూడా పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయన్నారు. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్.. ఆ రోజు రాజకీయ సభలకు ప్లాన్ చేసిందని విమర్శించారు. అమిత్ షా పాల్గొనే కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.


సెప్టెంబరు 17 సాయంత్రం రాష్ట్రపతి భవన్లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. ఈ వేడుకలలో పోరాట యోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందన్నారు. మీరు మీటింగులు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ అదే రోజు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్‌తో కుమ్మకై విమోచన దినోత్సవ వేడుకలను పక్కదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది కేంద్ర అధీనంలో జరిగిన విమోచన దినోత్సవ వేడుకలకు రాకుండా డుమ్మా కొట్టిన కేసీఆర్.. ఈ ఏడాది కూడా కేసీఆర్‌కు విమోచన దినోత్సవం వేడుకలకు ఆహ్వానం పంపిస్తామన్నారు. సీఎం విమోచన దినోత్సవం వేడుకకు రావాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-09T12:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising