TDP Chief: ముగిసిన కంటి శస్త్ర చికిత్స.. ఇంటికి బయలుదేరిన చంద్రబాబు
ABN, First Publish Date - 2023-11-07T13:24:21+05:30
ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటి శస్త్ర చికిత్స ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు చంద్రబాబుకు ఎల్వీప్రసాద్ వైద్యులు సర్జరీ చేశారు.
హైదరాబాద్: ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) కంటి శస్త్ర చికిత్స (Eye surgery) ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు చంద్రబాబుకు ఎల్వీప్రసాద్ వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం ఎల్వీప్రసాద్ ఆస్పత్రి నుంచి కాన్వాయ్‌లో టీడీపీ చీఫ్ ఇంటికి బయలుదేరి వెళ్లిపోయారు. చంద్రబాబుకు ఎల్వీప్రసాద్ వైద్యులు కంటికి శస్త్ర చికిత్స చేశారు. జూన్‌లో చంద్రబాబు ఎడమ కంటికి సర్జరీ జరుగగా.. ఈరోజు కుడి కంటికి శస్త్ర చికిత్స జరిగింది. నిన్న (సోమవారం) ఏఐజీలో చంద్రబాబుకు వైద్యులు చర్మ సంబంధిత పరీక్షలు నిర్వహించారు.
Updated Date - 2023-11-07T13:24:22+05:30 IST