Sridhar Babu: కాంగ్రెస్ హామీ ఇస్తే వెంటనే నెరవేరుస్తుంది
ABN, First Publish Date - 2023-09-21T18:48:32+05:30
కాంగ్రెస్ పార్టీ(Congress party) అంటే నమ్మకం.. కాంగ్రెస్ ఏ హామీ ఇచ్చిన వెంటనే అమలు చేసి తీరుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Sridhar Babu) పేర్కొన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ(Congress party) అంటే నమ్మకం.. కాంగ్రెస్ ఏ హామీ ఇచ్చిన వెంటనే అమలు చేసి తీరుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Sridhar Babu) పేర్కొన్నారు. గురువారం నాడు గాంధీభవన్‌లో మ్యానిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసింది. ప్రజలకు ఎలాంటి మార్పు కావాలని కోరుకుంటున్నారో అలాంటి హామీలు ఇస్తాం.త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తాం.జిల్లాలు, నియోజకవర్గాలల్లో కూడా అక్కడి ప్రత్యేక అంశాలతో స్థానిక మేనిఫెస్టోలు కూడా ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మెగా డీఎస్సీ పెట్టాలి. 13,500 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఏర్పాటు చేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం అని శ్రీధర్‌బాబు తెలిపారు.
Updated Date - 2023-09-21T18:48:32+05:30 IST