ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ramcharan: జోగినిపల్లి “వింగ్స్ ఆఫ్ పాషన్” పుస్తక ఆవిష్కరణ

ABN, First Publish Date - 2023-08-19T23:20:36+05:30

రాజకీయం, ప్రజాసేవలో ఉంటూ.. కళల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని. అలాంటి అరుదైన, మంచి మనసున్న వ్యక్తి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్(Joginipalli Santhosh Kumar)” అని గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Global Star Ramcharan)అన్నారు.

హైదరాబాద్: రాజకీయం, ప్రజాసేవలో ఉంటూ.. కళల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని. అలాంటి అరుదైన, మంచి మనసున్న వ్యక్తి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్(Joginipalli Santhosh Kumar)” అని గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Global Star Ramcharan)అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ తీసిన ఛాయాచిత్రాలతో కూడిన “వింగ్స్ ఆఫ్ పాషన్” (Wings of Passion) పుస్తకాన్ని ఈరోజు(శనివారం) తన నివాసంలో జోగినిపల్లితో కలిసి రాంచరణ్ ఆవిష్కరించారు. అనంతరం రాంచరణ్ మీడియాతో మాట్లాడుతూ.. “పక్షులతో ఉన్నప్పుడు నిశ్శబ్ధంగా ఉండమని” ఈ పుస్తకంలో వారు చెప్పిన మాట నా హృదయాన్ని హత్తుకుంది. జీవుల పట్ల ఎంతో కరుణా, జాలి, ప్రేమ, వాటితో నిరంతర సహవాసం ఉంటే తప్పా.. అద్భుతమైన ఆ తత్వాన్ని అర్ధం చేసుకోలేం. పక్షులు, మూగజీవాలను అర్ధం చేసుకోవడానికి వారు ఎంత శ్రమించారో చెప్పడానికి ఆ ఒక్క మాట సరిపోతుంది. దేశంలో ఎందరో ఫొటోగ్రాఫర్లు ఉండొచ్చు కానీ.. రాజకీయ రంగం నుంచి వచ్చి ఇలా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్(Professional photographer) లా ఫొటోలు తీసి.. వాటిని పుస్తకంగా తీసుకొచ్చిన నేత బహుశ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఒక్కరే కావచ్చు’’ అని చరణ్ పేర్కొన్నారు.

“కళ, కళ కోసం కాదు.. ప్రజల కోసం” అన్నారు మన పెద్దలు. ’’సంతోష్ తన ఫొటోల ద్వారా పక్షులు, జంతువుల, వాటి ఆవాసాలు, వాటి జీవవైవిధ్యాన్ని తన ఫొటోల ద్వారా ఆవిష్కరిస్తూ.. తన కళను ప్రదర్శిస్తూ.. పక్షులు, మూగజీవాల పట్ల ప్రజలల్లో అవగాహన తీసుకొస్తున్నారు. ఇది ఎంతో పరిణతితో కూడిన బాధ్యత. అంతేకాదు, పక్షులకు దూరమైన మొక్కలను నాటిస్తున్నారు. మరో పక్క వాటి పట్ల ప్రజలల్లో అవగాహన కల్పిస్తూ.. నిరంతరం ప్రకృతి సమతూల్యత కోసం పరితపిస్తున్నారు’’ అని జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని ఈ సందర్భంగా రాంచరణ్ అభినందించారు.

Updated Date - 2023-08-19T23:20:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising