ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ప్రజావాణి కార్యక్రమం.. గత ప్రభుత్వంలో అన్యాయం: హోంగార్డులు

ABN, Publish Date - Dec 22 , 2023 | 11:58 AM

హైదరాబాద్: ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రతి మంగళ, శుక్రవారం ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజా సమస్యలపై ధరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది.

హైదరాబాద్: ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రతి మంగళ, శుక్రవారం ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజా సమస్యలపై ధరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పింఛన్లు, ఇళ్లు, ఉద్యోగాలు ఇప్పించాలని పెద్ద ఎత్తున వచ్చిన జనాలు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు.

హోంగార్డులకు సంబధించి 250 మంది తమ సమస్యను ప్రజా భవన్‌లో అధికారులకు విన్నవించుకునేందుకు వచ్చారు. ఈ సందర్బంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. 250 మంది హోంగార్డులం ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు విధులు నిర్వహించిన తర్వాత.. తమకు ఆర్డర్ కాపీ లేదని 2011లో తీసేశారని, 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక తమకు న్యాయం చేయాలని తిరగ్గా.. తిరగ్గా 2018లో మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేరలేదని అన్నారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరినీ ఆదుకుంటామని గతంలో మాకు రేవంత్ రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని.. ఇప్పుడు తమను విధుల్లోకి తీసుకుంటారనే నమ్మకంతో ప్రజా వాని కార్యక్రమానికి వచ్చామని హోంగార్డులు చెప్పారు.

Updated Date - Dec 22 , 2023 | 11:58 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising