ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NVSS Prabhaka: పేదలను మోసం చేస్తున్న కేసీఆర్

ABN, First Publish Date - 2023-09-22T18:01:55+05:30

పేదలను నమ్మించి మోసం చేయడం సీఎం కేసీఆర్‌(CM KCR)కు అలవాటుగా మారిందని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS Prabhakar) వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: పేదలను నమ్మించి మోసం చేయడం సీఎం కేసీఆర్‌(CM KCR)కు అలవాటుగా మారిందని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS Prabhakar) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే డబుల్ బెడ్ రూం ఇళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించి ఇస్తున్నామని ప్రజలను నమ్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాటా లేదని కేసీఆర్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లేకుండా పోయింది. పేదలకు ఇళ్లు దక్కలేదు. ప్రగతి భవన్ డైరెక్షన్‌లో మాత్రమే డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ జరగింది. లబ్ధిదారుల లిస్ట్ ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో లేవు. మూడు లక్షలు ఇచ్చిన వారికి మాత్రమే ఇళ్లు కేటాయించారు. పీఎం అవాస్ యోజన కింద ఇతర రాష్ట్రాలల్లో లక్షల ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇళ్ల డ్రాలల్లో అవకతవకలు జరిగాయి. అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. డ్రాలో మొత్తం పేర్లు పెట్టకుండా తెలంగాణ భవన్ నుంచి వచ్చిన పేర్లు మాత్రమే కలెక్టరేట్లో డ్రాలు తీస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఆధారాలతో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు ఫిర్యాదు చేస్తాం’’ అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-22T18:01:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising