ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gutta Sukhender: ‘కేటీఆర్ భవిష్యత్ ఉన్న నేత... బురదజల్లడం సరికాదు’

ABN, First Publish Date - 2023-03-23T13:56:26+05:30

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన దురదృష్టకరమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Leakage) ఘటన దురదృష్టకరమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy) అన్నారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గుత్తా మాట్లాడుతూ.. ఒకరిద్దరు చేసిన తప్పును వ్యవస్థకు ఆపాదించడం సరికాదన్నారు. టీఎస్‌పీఎస్సీ పారదర్శకంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ఘటనపై రాజకీయాలు చేయటం సరికాదన్నారు. కేటీఆర్ (Minister KTR) భవిష్యత్ ఉన్న నేత అని.. ఆయనపై బురదజల్లటం సరికాదన్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రతిపక్షాలు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తాయని విమర్శించారు. వాస్తవమా కాదా అనేది ప్రతిపక్షాలు పట్టించుకోవన్నారు. పొలిటికల్ మోటివేషన్‌తో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విచారణలో ఎవరు బాధ్యులు అయితే వారికి శిక్ష పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

గవర్నర్ బిల్లులను పెండింగ్‌లో పెట్టడం వల్ల పాలనకు ఆటంకం కలుగుతుందన్నారు. ఏమైనా సవరణలు ఉంటే ప్రభుత్వానికి సూచించాలని తెలిపారు. ప్రజల అవసరాలు తీర్చే విధంగా గవర్నర్ వ్యవహారించాలని సూచించారు. కేంద్రం దర్యాప్తు సంస్థలతో రాష్ట్ర నాయకత్వాన్ని వేధిస్తోందని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు కోసం కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడుతోందని ప్రశ్నించారు. ఆధిపత్య పోరులో భాగంగానే రేవంత్ (Revanth Reddy), భట్టి విక్రమార్క (Batti Vikramarka) పాదయాత్రలు చేస్తున్నారన్నారు. తన కుమారుడు అమిత్ ఎక్కడ పోటీ చేయాలన్నది తన చేతుల్లో లేదని.. పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అంటూ చెప్పుకొచ్చారు. తాను సంతృప్తిగానే ఉన్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-23T13:56:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising