TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు మరో రెండు పేపర్లు రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ
ABN, First Publish Date - 2023-03-17T14:38:02+05:30
గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను కూడా టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. ఇప్పటికే ఏఈ పరీక్ష (AE Exam) తో పాటు టౌన్
హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను కూడా టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. ఇప్పటికే ఏఈ పరీక్ష (AE Exam) తో పాటు టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్లను రద్దు చేసింది. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈఈ, డీఏవో పరీక్ష పేపర్లను కూడా రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.
గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను 2022, సెప్టెంబర్ 16న నిర్వహించారు. రద్దు చేసిన ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను జూన్ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సిట్ నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. 2023, జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. త్వరలో జరగబోయే మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC paper leak) కేసు నిందితుడు ప్రవీణ్ పెన్‌డ్రైవ్ (Praveen pen drive)లో ఇప్పటికే గుర్తించిన మూడు పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు, మరో రెండు పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు కూడా ఉన్నట్టు ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. అవి కాక.. ఎంవీఐ, గ్రౌండ్‌వాటర్ ఎగ్జామ్ పేపర్లు కూడా అతడి పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్టు గుర్తించామని ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఏఈ పరీక్ష ప్రశ్నపత్రంలాగా మిగతా పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లను సైతం ప్రవీణ్ ఇంకెవరికైనా ఇచ్చాడా? లేక అతడి పెన్‌డ్రైవ్‌కు మాత్రమే అవి పరిమితమయ్యాయా? అనే విషయాన్ని తేల్చేపనిలో ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే, ప్రవీణ్ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా.. పలువురు మహిళల నగ్నచిత్రాలు, అశ్లీలపదజాలంతో కూడిన చాటింగ్‌లు, 50కి పైగా నగ్న వీడియోలు ఉన్నట్టు తెలిసింది. అతడికి న్యూడ్ కాల్స్ చేసిన మహిళలు ఎవరో గుర్తించడంపై పోలీసులు దృష్టి సారించారు.
ఇది కూడా చదవండి: TSPSC paper leak: ఇంకా ఉంది.. తవ్వేకొద్దీ బయటకొస్తున్న...!
Updated Date - 2023-03-17T15:34:15+05:30 IST