Resign: కాంగ్రెస్‌కు మాజీ సీఎం అంజయ్య మనవడు గుడ్ బై
ABN, First Publish Date - 2023-10-31T09:56:02+05:30
కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం అంజయ్య మనవడు అభిషేక్ రెడ్డి గుడ్‌బై చెప్పేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం అంజయ్య మనవడు అభిషేక్ రెడ్డి (Former CM Anjaiah Grandson Abhishek Reddy) గుడ్‌బై చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అభిషేక్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరుకు మంగళవారం ఉదయం పత్రికా ప్రకటన విడుదలైంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు (AICC Chief Mallikarjuna Kharge) అభిషేక్ రెడ్డి రాజీనామా లేఖను పంపించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన ఈరోజు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో (BRS) చేరనున్నారు.
రాజీనామా లేఖలో...
‘‘సంవత్సరాలుగా పార్టీకి విధేయులుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎళ్లవేళలా కృషి చేసినా కూడా పార్టీలో సరైన గుర్తింపు రాకపోవడానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’’ అంటూ అభిషేక్‌రెడ్డి రాజీనామా లేఖలో రాశారు.
Updated Date - 2023-10-31T09:57:02+05:30 IST