ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Avinash Reddy : వివేకా కేసులో సీబీఐ కోర్టుకు చేరుకున్న అవినాష్ రెడ్డి

ABN, First Publish Date - 2023-08-14T10:20:50+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ఆయన సీబీఐ కోర్టుకి చేరుకున్నారు. గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ఆయన సీబీఐ కోర్టుకి చేరుకున్నారు. గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ రెడ్డిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డిని సీబీఐ చేర్చిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో 145 పేజీలతో మూడో ఛార్జిషీట్ దాఖలు చేసింది. జూన్ 19 తేదీన సీబీఐ డైరెక్టర్‌కు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. దర్యాప్తును పునః సమీక్షించాలని లేఖలో పేర్కొన్నారు. గత దర్యాప్తు అధికారి రాంసింగ్ పై లేఖలో ఆరోపణలు గుప్పించారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై అవినాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని అవినాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. వాటిపై మరోసారి పునః పరిశీలన చేయాలని కోరారు. లేఖపై సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Updated Date - 2023-08-14T10:20:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising