Devagiri Express: దేవగిరి ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి వరకు పొడిగింపు
ABN, First Publish Date - 2023-12-13T07:51:40+05:30
సికింద్రాబాద్-ముంబై మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్(Devagiri Express) రైలును లింగంపల్లి వరకు పొడిగించినట్లు
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్-ముంబై మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్(Devagiri Express) రైలును లింగంపల్లి వరకు పొడిగించినట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు పేర్కొన్నారు. 17058 రైలు ఈ నెల 14న లింగంపల్లి(Lingampally) నుంచి మధ్యాహ్నం 12.25 గంటలకు బయల్దేరి బేగంపేట (ఒంటిగంటకు), సికింద్రాబాద్ (1.20గంటలకు) మీదుగా ముంబైకి చేరుకుంటుంది. ముంబై నుంచి వచ్చే 17057 రైలు ఈ నెల 15న మధ్యాహ్నం 2.35 గంటలకు సికింద్రాబాద్, 3.40 గంటలకు లింగంపల్లికి చేరుతుంది.
Updated Date - 2023-12-13T07:51:41+05:30 IST