ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gone Prakash: కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావుపై గోనె ప్రకాష్ సంచలన ఆరోపణలు

ABN, First Publish Date - 2023-11-21T11:44:58+05:30

పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావుపై మాజీ ఎమ్మెల్యే గొనే ప్రకాష్ సంచలన ఆరోపణలు చేశారు. చింతకుంట విజయ రమణారావు ఆస్తులు, పాన్ కార్డులు, అప్పుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకుండా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్నారు.

న్యూఢిల్లీ: పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావుపై (Congress candidate Chintakunta Vijaya Ramana Rao) మాజీ ఎమ్మెల్యే గొనే ప్రకాష్ ( Former MLA Gone Prakash Rao) సంచలన ఆరోపణలు చేశారు. చింతకుంట విజయ రమణారావు ఆస్తులు, పాన్ కార్డులు, అప్పుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకుండా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్నారు. విజయ రమణారావుకు హాంగ్ కాంగ్‌లో అపార్ట్‌మెంట్‌ ఉందని.. హైదరాబాద్‌లో రెంట్ వచ్చే అపార్మెంట్‌లు కూడా ఉన్నాయన్నారు. రెండు పాన్ కార్డ్స్ ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఈడీ, ఆదాయపన్ను శాఖ, హోమ్ శాఖ, ఆర్ధిక శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


విజయ రమణారావు తప్పులు తేలితే ఆరేళ్ళు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందన్నారుు. హైదరాబాద్‌లో ఆదాయపన్ను అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. విజయ రమణారావుకు ఓటు వేస్తే పెద్దపల్లి ప్రజలు ఓటు వృధా అవుతుందన్నారు. 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉండి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నందుకు, చట్ట విరుద్ధంగా వ్యవహరించినందుకు జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉందన్నారు. ‘‘విజయ రమణారావుకు వ్యతిరేకంగా ఫేక్ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసే అవసరం నాకు లేదు. నన్ను మోసం చేసాడు ఇబ్బంది పెట్టాడు కాబట్టి దర్యాప్తు సంస్థల దృష్టికి విజయ రమణా రావుపై ఫిర్యాదు చేస్తున్నా’’ అని గోనె ప్రకాష్ రావు పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-21T11:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising