ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు.. రెబల్స్ నామినేషన్లు దాఖలు

ABN, First Publish Date - 2023-11-10T18:21:19+05:30

చివరి నిమిషంలో బీజేపీ అగ్రనాయత్వం అభ్యర్థులను మార్చడంతో బీజేపీలో మహిళా నేతల కన్నీరు పెట్టుకుంటున్నారు. టికెట్ దక్కకపోవడంతో పలుచోట్ల రెబల్‌ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.

హైదరాబాద్: చివరి నిమిషంలో బీజేపీ అగ్రనాయత్వం అభ్యర్థులను మార్చడంతో బీజేపీలో మహిళా నేతల కన్నీరు పెట్టుకుంటున్నారు. టికెట్ దక్కకపోవడంతో పలుచోట్ల రెబల్‌ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. 13న నామినేషన్ల పరిశీలన, 15 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ రోజు నామినేషన్ల స్వీకరణకు చివరిరోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

మెన్న‌ నిర్మల్ రమాదేవి.. నేడు వేములవాడలో తుల ఉమ, కంటోన్మెంట్‌లో రజనీ టికెట్‌ దక్కకపోవడం ఆవేదన చెందుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును గణేష్ నారాయణ్‌కు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తిలో బీజేపీ ఆశావాహులు ఉన్నారు. రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు మోసం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. కంటోన్మెంట్ బీజేపీ‌ నేత రామకృష్ణ బ్రోకర్ మాదిరి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుడి జేబులో కిషన్ రెడ్డి, ఎడవ జేబులో లక్ష్మణ్ ఉన్నాడని గణేష్ చెప్తున్నాడని, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గణేష్ నారాయణ్‌కు రాత్రికి రాత్రే బీజేపీ టికెట్ ఎలా ఇచ్చారు? అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ బహిరంగ సభలకు మైక్ సెట్‌లు పెట్టే రామకృష్ణ (RK) అనే బ్రోకర్ వల్లనే ఇదంతా జరిగిందని ఆవేదన చెందుతున్నారు. తమ పార్టీ పెద్దలు కనీసం తమకు చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు? అని ప్రశ్నిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ ఆశించి నేతలు భంగపడ్డారు.

చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చడంతో పలుచోట్ల రెబల్‌ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.

Updated Date - 2023-11-10T18:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising