ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Sanjay : మందికి పుట్టిన పిల్లలను తమ పిల్లలుగా చెప్పుకునే రకం గంగుల

ABN, First Publish Date - 2023-11-14T13:02:21+05:30

Telangana Elections : బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలది భూకబ్జాలు, అవినీతి లొల్లి అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇసుక కుప్పలు కన్పిస్తే బీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని... ఖాళీ జాగాలు కన్పిస్తే కబ్జాలు చేస్తున్నారన్నారు. యువతను మంత్రి గంగుల కమలాకర్ గంజాయి మత్తులో ముంచుతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు గల్లీలో తిరుగుతుంటే జనమే నిలదీస్తున్నారన్నారు.

కరీంనగర్ : బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలది భూకబ్జాలు, అవినీతి లొల్లి అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇసుక కుప్పలు కన్పిస్తే బీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని... ఖాళీ జాగాలు కన్పిస్తే కబ్జాలు చేస్తున్నారన్నారు. యువతను మంత్రి గంగుల కమలాకర్ గంజాయి మత్తులో ముంచుతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు గల్లీలో తిరుగుతుంటే జనమే నిలదీస్తున్నారన్నారు. ఓట్ల కోసం ఓటుకు రూ.10 వేలు పంచేందుకు సిద్ధమయ్యాడని బండి సంజయ్ పేర్కొన్నారు.

లక్ష సెల్ ఫోన్లు పంచేందుకు గంగుల కమలాకర్ సిద్ధమయ్యాడని పేర్కొన్నారు. గంగుల ఓటమి ఖాయమని కేసీఆర్‌కు ఎప్పుడో తెలుసన్నారు. అందుకే ఒవైసీ వద్ద మోకరిల్లి పచ్చజెండా పట్టుకున్నాడన్నారు. భూకబ్జాలు తప్ప కాంగ్రెస్ చేసిందేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. మందికి పుట్టిన పిల్లలను తమ పిల్లలుగా చెప్పుకునే రకం గంగుల అని విమర్శించారు. గంగుల కమలాకర్ మళ్లీ గెలిస్తే జీతాలు, ఫించన్లు రావన్నారు. మా అత్త చనిపోయిందని ఇంటికొస్తే కేసీఆర్, గంగుల కుట్ర చేసి తనను జైలుకు పంపారని బండి సంజయ్ తెలిపారు.

Updated Date - 2023-11-14T13:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising