ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: టికెట్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఎప్పటి నుంచి అంటే..?

ABN, First Publish Date - 2023-08-15T18:10:53+05:30

వన్డే ప్రపంచకప్‌నకు సరిగ్గా మరో 50 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అభిమానులు ప్రపంచకప్ మ్యాచ్‌ల టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రపంచకప్ టికెట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది.

వన్డే ప్రపంచకప్‌నకు సరిగ్గా మరో 50 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అభిమానులు ప్రపంచకప్ మ్యాచ్‌ల టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రపంచకప్ టికెట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్టు ఐసీసీ పేర్కొంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా టికెట్ల అమ్మకాలకు సంబంధించిన వివరాలను అందరి కంటే ముందుగా పొందవచ్చని ఐసీసీ చెబుతోంది. కాగా https://www.cricketworldcup.com/register ద్వారా అభిమానులు తమ రిజిస్ట్రేషన్లను నమోదు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అభిమానులంతా టీమిండియా ఆడే మ్యాచ్‌ల టికెట్లను బుక్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. అయితే ఆగష్టు 30 నుంచి అన్ని జట్లు ఆడే మ్యాచ్‌ల టికెట్లు క్రమంగా అందుబాటులోకి రానున్నాయి.


ఐసీసీ తెలిపిన వివరాల ప్రకారం అన్ని మ్యాచ్‌ల టికెట్లు ఒకేసారి అందుబాటులో ఉండవు. ఒక్కో రోజు, ఒక్కో మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ముందుగా 25 నుంచి వామప్ మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉంటాయి. కాగా టీమిండియా ఆడే మ్యాచ్‌ల టికెట్ల వివరాలను ఐసీసీ ప్రకటించింది. ముందుగా భారత జట్టు గౌహతి, త్రివేండ్రంలలో ఆడే మ్యాచ్‌ల టికెట్లు ఆగష్టు 30 నుంచి అందుబాటులోకి రానున్నాయి. చెన్నై, ఢిల్లీ, పుణెలలో ఆడే మ్యాచ్‌ల టికెట్లు ఆగష్టు 31 నుంచి, ధర్మశాల, లక్నో, ముంబైలలో ఆడే మ్యాచ్‌ల టికెట్లు సెప్టెంబర్ 1 నుంచి, బెంగళూరు, కోల్‌కతాలో ఆడే మ్యాచ్‌ల టికెట్లు సెప్టెంబర్ 2 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇక చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అహ్మదాబాద్‌లో జరిగే భారత్, పాకిస్థాన్ ‌మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు సెప్టెంబర్ 3న అందుబాటులోకి రానున్నాయి. చివరగా సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల టికెట్లు సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

Updated Date - 2023-08-15T18:10:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising