ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

VVS Laxman: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ABN, First Publish Date - 2023-08-27T18:53:09+05:30

సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడల్లో ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఆసియా క్రీడలకు బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును పంపుతున్న సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడల్లో ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఆసియా క్రీడలకు బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును పంపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా ఉన్న లక్ష్మణ్ టీమిండియాతోపాటు ఆసియా క్రీడలు జరిగే చైనాకు వెళ్లనున్నాడు. లక్ష్మణ్‌తోపాటు సాయిరాజ్ బహుతులే, మునీష్ బాలి కూడా కోచింగ్ యూనిట్‌లో ఉండనున్నారు. సాయిరాజ్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనుండగా.. మునీష్ బాలి ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కాగా టీమిండియాకు లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించడం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా రాహుల్ ద్రావిడ్ గైర్హాజరీలో ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలకు.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు లక్ష్మణే టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. కాగా భారత అండర్ 19 జట్టుకు కూడా లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే 2021 ప్రపంచకప్‌ను భారత యువ జట్టు గెలిచింది. అదే సమయంలో ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టుకు కూడా తాత్కాలిక హెడ్ కోచ్‌గా హృషికేశ్ కనిట్కర్ వ్యవహరించనున్నాడు. రజిబ్ దత్తా బౌలింగ్ కోచ్‌గా.. శుభదీప్ ఘోష్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు.


ఆసియా క్రీడల సమయంలో టీమిండియా ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా బిజీగా ఉండనుంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా సీనియర్ జట్టుతోనే ఉండనున్నాడు. దీంతో బీసీసీఐ పూర్తిగా ద్వితీయ శ్రేణి జట్టును ఆసియా క్రీడలకు ఎంపిక చేసింది. ఆ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం కానుండగా.. పురుషుల ఈవెంట్ సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభంకానుంది.

టీమిండియా స్క్వాడ్

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్.

Updated Date - 2023-08-27T18:53:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising