ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rohit Sharma: టీ20 ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్నా.. రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ పరోక్ష వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-08-06T16:55:36+05:30

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అమెరికాలోని ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2024లో అమెరికాలో జరిగే ప్రపంచకప్‌లో ఆడాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అమెరికాలోని ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2024లో అమెరికాలో జరిగే ప్రపంచకప్‌లో ఆడాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. కాగా 36 ఏళ్ల రోహిత్ శర్మ కొంతకాలం తర్వాత క్రికెట్ నుంచి పూర్తిగా కాకపోయినా ఏదో ఒక ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడానే ఊహాగానాలున్నాయి. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌కు చోటు దక్కే అవకాశాలు లేవనే పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా ప్రస్తుతం రోహిత్ శర్మనే అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ గత టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి విశ్రాంతి పేరుతో అతన్ని సెలెక్టర్లు పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంచుతున్నారు. దీంతో హార్దిక్ పాండ్యా ఆ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉంటున్నాడు. సెలెక్టర్లు టీ20లకు దూరంగా ఉంచుతున్న వారిలో రోహిత్‌తోపాటు కోహ్లీ, జడేజా, షమీ వంటి వారున్నారు. వీరికి వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో చోటు కష్టమనే ఊహాగానాలున్నాయి.


కాగా వెస్టిండీస్ పర్యటలో టెస్టు, వన్డే సిరీస్ ముగిసిన తర్వాత సెలవులు దొరకడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అమెరికా వెళ్లాడు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పరోక్షంగా తన వీడ్కోలుపై హిట్‌మ్యాన్ స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. "ఎంజాయ్ చేయడం కంటే, ఇక్కడికి (యుఎస్‌ఎలో) రావడానికి మరో కారణం ఉంది. వచ్చే ఏడాది జూన్‌లో ఇక్కడ టీ20 ప్రపంచ కప్ (2024) జరగనుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను కూడా ఇక్కడ జరిగే ప్రపంచకప్ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రపంచకప్‌లో నాకు కూడా బరిలోకి దిగాలని ఉంది" అని రోహిత్ పేర్కొన్నాడు.

రోహిత్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు తన రిటైర్మెంట్‌పై పరోక్షంగా స్పందించినట్లుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పలువురు భావిస్తున్న విధంగా ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనలో లేడని అర్థమవుతుంది. అయితే రోహిత్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు నిజం అయ్యే అవకాశాలు లేకపోలేదు. హిట్‌మ్యాన్ కొంత కాలంగా పొట్టి ఫార్మాట్‌లో రాణించలేకపోతున్నాడని కానీ, నిజానికి టీ20ల్లో అతనికి మంచి రికార్డులున్నాయి. ఇప్పటికీ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు అతని పేరు మీదనే ఉండడం గమనార్హం. రోహిత్ శర్మ కెప్టెన్సీలో రానున్న వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టు గెలిస్తే.. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ హిట్‌మ్యాన్ కెప్టెన్సీలోనే బరిలోకి దిగే అవకాశాలుంటాయి. కాగా వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-08-06T16:57:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising