ODI World Cup: భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ రీషెడ్యూల్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్.. మ్యాచ్ జరిగేది ఎప్పుడంటే..?
ABN, First Publish Date - 2023-08-02T19:14:23+05:30
అనుకున్నదే జరిగింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న కాకుండా అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగడం దాదాపుగా ఖరారు అయిపోయింది.
అనుకున్నదే జరిగింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న కాకుండా అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగడం దాదాపుగా ఖరారు అయిపోయింది. ఈ మార్పునకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించినట్లు జాతీయ క్రీడా సంస్థలు చెబుతున్నాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14కి రీషెడ్యూల్ కావడంతో అక్టోబర్ 12న శ్రీలకంతో పాక్ ఆడాల్సిన మ్యాచ్ షెడ్యూల్‌లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ మ్యాచ్ అక్టోబర్ 12న కాకుండా రెండు రోజులు ముందుగా అంటే అక్టోబర్ 10న నిర్వహించనున్నారు. ఎందుకంటే 12న మ్యాచ్ నిర్వహిస్తే భారత్‌తో మ్యాచ్‌కు సిద్ధం కావడానికి పాకిస్థాన్‌కు ఒకే రోజు సమయం ఉంటుంది. షెడ్యూల్‌ను 10కి మార్చడం ద్వారా పాకిస్థాన్‌కు 3 రోజుల సమయం లభించనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మార్పులపై ఐసీసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
సవరించిన షెడ్యూల్‌తో 14న మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి. 14న అహ్మదాబాద్‌లో జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌తోపాటు చెన్నైలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. ఢిల్లీలో ఆప్ఘనిస్థాన్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఇందులో ఆఫ్థనిస్థాన్, ఇంగ్లండ్ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసి అక్టోబర్ 13న నిర్వహించే అవకాశాలున్నాయి. కాగా ఈ మార్పులన్నీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయడంతోనే చోటుచేసుకుంటున్నాయి. నిజానికి అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా అక్టోబర్ 15న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ అదే రోజు నుంచి గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో భద్రపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని భద్రతా సంస్థలు బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో మ్యాచ్ షెడ్యూల్ మార్పునకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. కాగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే.
Updated Date - 2023-08-02T19:14:23+05:30 IST