ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AFG VS NED: నెదర్లాండ్స్ నిర్లక్ష్యం.. 9 ఓవర్ల తేడాలో మూడు రనౌట్లు..!!

ABN, First Publish Date - 2023-11-03T16:01:07+05:30

ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్లు నిర్లక్ష్యం ప్రదర్శించారు. 9 ఓవర్ల తేడాతో ముగ్గురు రనౌట్ అయ్యారు. ఓడౌడ్, అకెర్ మాన్, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ రనౌట్ రూపంలో వికెట్ సమర్పించుకున్నారు.

వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్, ఆప్ఘనిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఇరుజట్లు ఆరేసి చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. ఆప్ఘనిస్తాన్ మూడు మ్యాచ్‌లలో గెలిచి మరో మూడింట్లో ఓడింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు నెదర్లాండ్స్ రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగింట్లో ఓడి 4 పాయింట్లతో 8వ స్థానానికి పరిమితమైంది. దీంతో నెదర్లాండ్స్ కంటే ఆప్ఘనిస్తాన్‌కు సెమీస్‌కు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌పై ఆప్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంది.

లక్నో వేదికగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే ఆ జట్టుకు షాక్ తగిలింది. 3 పరుగులకే ఓపెనర్ వెస్లీ బరెసీ పెవిలియన్‌కు చేరాడు. దీంతో నెదర్లాండ్స్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. కానీ ఓడౌడ్, అకెర్ మాన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే ఇక్కడే నెదర్లాండ్స్ బ్యాటర్లు నిర్లక్ష్యం ప్రదర్శించారు. 9 ఓవర్ల తేడాతో ముగ్గురు రనౌట్ అయ్యారు. ఓడౌడ్, అకెర్ మాన్, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ రనౌట్ రూపంలో వికెట్ సమర్పించుకున్నారు. దీంతో 113 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి నెదర్లాండ్స్ కష్టాల్లో పడింది. ఆప్ఘనిస్తాన్ బౌలర్లలో ముజీబ్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది.

Updated Date - 2023-11-03T16:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising