ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా ప్రపంచ రికార్డు

ABN, First Publish Date - 2023-12-02T13:54:51+05:30

World Record: ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న టీమిండియా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో తక్కువ స్కోరు చేసినా 20 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా అవతరించింది.

ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న టీమిండియా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో తక్కువ స్కోరు చేసినా 20 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా అవతరించింది. దీంతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ రికార్డును బద్దలు కొట్టింది. టీ20ల్లో టీమిండియాకు ఇది 136వ విజయం. 2006 నుంచి ఇప్పటి వరకు భారత్ 136 మ్యాచ్‌ల్లో గెలవగా.. 67 మ్యాచ్‌లలో ఓటమి చవి చూసింది. ఒకటి టైగా ముగియగా.. మూడు మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా విజయాల శాతం 63.84గా ఉంది.

కాగా గతంలో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన రికార్డు పాకిస్థాన్ పేరిట ఉండేది. మొత్తం 226 మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ 135 విజయాలను సాధించింది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. టీ20 ఫార్మాట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన కివీస్ 102 విజయాలు సాధించింది. నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. ఆ జట్టు 181 మ్యాచ్‌లు ఆడి 95 విజయాలు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా 171 మ్యాచ్‌ల్లో 95 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. టాప్-5లో ఉన్న ఐదు జట్లలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా మాత్రమే టీ20 ప్రపంచకప్ కూడా సాధించాయి. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మాత్రం ప్రపంచకప్‌ను ఇప్పటివరకు ముద్దాడలేక పోయాయి.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-02T13:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising