ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Video: బస్సులో టీమిండియా హోలీ సెలబ్రేషన్స్.. వైరల్ వీడియో

ABN, First Publish Date - 2023-03-07T21:19:38+05:30

రంగుల పండుగ హోలీ(Holi)ని టీమిండియా(Team India) క్రికెటర్లు బస్సులోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అహ్మదాబాద్: రంగుల పండుగ హోలీ(Holi)ని టీమిండియా(Team India) క్రికెటర్లు బస్సులోనే జరుపుకున్నారు. చివరి టెస్టు కోసం సన్నద్ధమవుతున్న క్రికెటర్లు.. మంగళవారం నరేంద్రమోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో ట్రైనింగ్ అనంతరం హోటల్ రూముకు వెళ్తూ బస్సులోనే రంగులు పూసుకుని ఉత్సాహంగా హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli), యువక్రికెటర్లు కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీని ఎంజాయ్ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను శుభమన్ గిల్(Shubman Gill) షేర్ చేశాడు. గిల్ బస్సులో సెల్ఫీ వీడియో తీస్తుంటే కోహ్లీ వెనక నుంచి ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. క్రికెటర్లు అందరూ రంగుల్లో మునిగి తేలారు. ఇక గిల్ ముఖమైతే రంగులతో నిండిపోయింది. గిల్ వీడియో తీస్తున్నప్పుడు చూసి రోహిత్ శర్మ ఒక్కసారిగా ఎగ్జైట్ అయ్యాడు. గిల్ వీడియో తీస్తున్నప్పుడు వెనక నుంచి రంగులు విసరడం కనిపించింది.

టీమిండియా సారథి రోహిత్ శర్మ కూడా హోలీ సెలబ్రేషన్స్‌కు సంబంధించి ఫొటోలను షేర్ చేశాడు. ఆ సెల్ఫీల్లో సూర్యకుమార్ యాదవ్, చతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ తదితరులు కనిపించారు. రోహిత్, గిల్ అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్రమోదీ స్టేడియంలోని డ్రెస్సింగ్‌ రూములో ప్రారంభమైన హోలీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ కూడా షేర్ చేసింది.

Updated Date - 2023-03-07T21:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising