ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Asia Cup 2023: నేపాల్‌ను కష్టపడి ఆలౌట్ చేసిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

ABN, First Publish Date - 2023-09-04T19:55:57+05:30

పాకిస్థాన్‌పై 103 పరుగులకే ఆలౌటైన నేపాల్ టీమిండియాపై మాత్రం గౌరవప్రదమైన ప్రదర్శన చేసింది. 50 ఓవర్లు ఆడాలని పట్టుదల ప్రదర్శించింది. కానీ చివరకు 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.

ఆసియా కప్ 2023లో పసికూన నేపాల్ టీమిండియా బౌలర్లకు చెమటలు పట్టించింది. పాకిస్థాన్‌పై 103 పరుగులకే ఆలౌటైన నేపాల్ టీమిండియాపై మాత్రం గౌరవప్రదమైన ప్రదర్శన చేసింది. 50 ఓవర్లు ఆడాలని పట్టుదల ప్రదర్శించింది. కానీ చివరకు 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా ముందు 231 రన్స్ టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్‌కు కూడా ఒకసారి వరుణుడు ఆటంకం కలిగించాడు. అప్పటికి నేపాల్ 37.5 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అయితే వర్షం ఆగిపోయిన తర్వాత ధాటిగా ఆడేందుకు నేపాల్ ప్రయత్నించింది.

ఇది కూడా చదవండి: Controversy: మైదానంలో మిడిల్ ఫింగర్ చూపించిన గంభీర్.. వీడియో వైరల్

నేపాల్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. టీమిండియా చెత్త ఫీల్డింగ్‌తో ఓపెనర్లకు మూడు లైఫ్స్ వచ్చాయి. దీంతో నేపాల్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 65 పరుగులతో పటిష్టంగానే కనిపించింది. ఆ జట్టు ఓపెనర్ ఆసిఫ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 97 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అయితే జడేజా, కుల్‌దీప్ రాకతో పరుగుల వేగం తగ్గింది. ఆ తర్వాత వర్షం కారణంగా అరగంటకు పైగా ఆట నిలిచిపోయింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ సోంపాల్ 56 బంతుల్లో 48 పరుగులు చేసి నేపాల్‌కు మంచి స్కోర్ అందించాడు. భారత బౌలర్లలో సిరాజ్, జడేజాకు తలో మూడు వికెట్లు దక్కాయి. షమీ, పాండ్య, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ సాధించారు.

Updated Date - 2023-09-04T19:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising