ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ireland vs India: తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్.. ఫైనల్ టీమ్ ఇదే..!!

ABN, First Publish Date - 2023-08-18T19:42:37+05:30

డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ ద్వారా రింకూ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ అరంగేట్రం చేయబోతున్నారు.

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఓటమి పాలైన తర్వాత టీమిండియా మరో టీ20 సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ ద్వారా రింకూ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ అరంగేట్రం చేయబోతున్నారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అదరగొట్టిన రింకూ సింగ్ తన తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాల్సిందే. అటు వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆకట్టుకున్న తిలక్ వర్మ, యషస్వీ జైశ్వాల్ తమ ఫామ్ కొనసాగించాల్సి ఉంది. మరి బుమ్రా కెప్టెన్సీలో యువ టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో వెయిట్ అండ్ సీ. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని జియో సినిమా ఓటీటీ యాప్‌లో వీక్షించవచ్చు.

తుది జట్లు

భారత్: జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యషస్వీ జైశ్వాల్, సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దూబె, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), బాల్బిరిన్, టక్కర్, హ్యారీ టెక్టార్, క్యాంఫర్, డోక్రెల్, మార్క్ అదిర్, మెకార్తి, క్రెయిగ్ యంగ్, జోష్ లిటిల్, బెన్ వైట్

ఇది కూడా చదవండి: Virat Kohli: కింగ్ కోహ్లీ కెరీర్‌కు 15 ఏళ్లు.. తొలి మ్యాచ్ ఆడింది ఈరోజే..!!

Updated Date - 2023-08-18T19:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising