ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND Vs AUS: టీమిండియాపై విమర్శల వర్షం.. సిరాజ్‌ను ఎందుకు తీసుకోలేదు?

ABN, First Publish Date - 2023-09-22T16:53:07+05:30

ప్రపంచకప్‌కు ముంగిట టీమిండియా సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టడంపై విమర్శల వర్షం కురుస్తోంది. మెగా టోర్నీకి ముందు ఇలాంటి దిక్కుమాలిన ప్రయోగాలు చేయడం ఎందుకంటూ సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరికొద్దిరోజుల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడుతోంది. అయితే చివరి అవకాశాన్ని కూడా భారత్ సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల నుంచి సీనియర్లను విశ్రాంతి పేరుతో పక్కనపెట్టింది. అక్కడితో ఆగకుండా ఆసియా కప్ ఫైనల్లో ఆరు వికెట్లతో రాణించిన సిరాజ్‌ను తొలి వన్డేలో తుది జట్టులోకి తీసుకోకుండా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆశ్చర్యపరిచాడు.

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆసియా కప్ ఫైనల్ ఆడిన జట్టులో ఐదు మార్పులు చేశామని తెలిపాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు కేఎల్ రాహుల్ వివరించాడు. మంచి ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ను పక్కన పెట్టినట్లు రాహుల్ తెలిపాడు. సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వడంతో పాటు షమీకి గేమ్ టైం దొరుకుతుందనే ఆలోచనతోనే టీం మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు పిచ్ చక్కగా ఉందని, కొన్ని విషయాల్లో జట్టు ఇంకా మెరుగవ్వాల్సి ఉందని కేఎల్ రాహుల్ చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ సవాలేనని, ఈ సిరీస్ కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: India vs Aussies ODI series : ఆఖరి సన్నాహకం

అయితే ప్రపంచకప్‌కు ముంగిట టీమిండియా సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టడంపై విమర్శల వర్షం కురుస్తోంది. మెగా టోర్నీకి ముందు ఇలాంటి దిక్కుమాలిన ప్రయోగాలు చేయడం ఎందుకంటూ సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు వన్డేలు కూడా ఆడలేని ఫిట్‌నెస్‌ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కీలక సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తే.. రేపు మెగా టోర్నీలో ఒకవేళ వాళ్లు రాణించకపోతే ప్రాక్టీస్ లేదని కల్లబొల్లి కబుర్లు చెప్పడానికి కోచ్ ద్రవిడ్ రెడీగా ఉన్నాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను రెస్ట్ పేరుతో పక్కనపెట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు.

Updated Date - 2023-09-22T17:24:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising