ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND Vs AUS: ఇరు జట్లలో భారీ మార్పులు.. మళ్లీ టాస్ ఆస్ట్రేలియాదే..!!

ABN, First Publish Date - 2023-12-01T19:11:29+05:30

IND Vs AUS: రాయ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా గత మ్యాచ్ తరహాలోనే ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీగా మార్పులు చేశాయి. ఆస్ట్రేలియా ఐదు మార్పులు చేయగా.. టీమిండియా నాలుగు మార్పులు చేసింది.

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు జరగ్గా.. తాజాగా రాయ్‌పూర్ వేదికగా నాలుగో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా గత మ్యాచ్ తరహాలోనే ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీగా మార్పులు చేశాయి. ఆస్ట్రేలియా ఐదు మార్పులు చేయగా.. టీమిండియా నాలుగు మార్పులు చేసింది. సీనియర్ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లడంతో రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇస్తున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ వెల్లడించాడు. క్రిస్ గ్రీన్‌కు క్యాప్ ప్రజంటేషన్ ఇచ్చామని తెలిపాడు. జాష్ ఫిలిప్పీ, మెక్ డెర్మాట్, ద్వార్షుస్, క్రిస్ గ్రీన్, మాథ్యూ షార్ట్ వంటి యువ ఆటగాళ్లను ఈ మ్యాచ్‌కు తీసుకున్నామని వేడ్ అన్నాడు. అటు టీమిండియాలో ఇషాన్ కిషన్ స్థానంలో జితేష్ శర్మ, ప్రసిధ్ కృష్ణ స్థానంలో దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో ముఖేష్ కుమార్, తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులోకి వచ్చారు.

తుది జట్లు

టీమిండియా: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, యషస్వీ జైశ్వాల్, జితేష్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్

ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్), జాష్ ఫిలిప్పీ, ట్రావిస్ హెడ్, మెక్ డెర్మాట్, అరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, బెన్ ద్వార్షుస్, క్రిస్ గ్రీన్, జాసన్ బెరన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-01T19:11:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising