ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KL Rahul: సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో కేఎల్ రాహుల్ పెళ్లి.. ప్రారంభమైన వేడుక!

ABN, First Publish Date - 2023-01-21T16:24:09+05:30

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) వివాహానికి సర్వం సిద్ధమైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) వివాహానికి సర్వం సిద్ధమైంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty) కుమార్తె అతియా శెట్టి(Athiya Shetty)తో చాలాకాలంగా ప్రేమలో ఉన్న రాహుల్.. సోమవారం (23న) ఆమె మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. వీరి వివాహ వేడుక ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ఖండాలా (Khandala)లోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో పెళ్లి వేడుకకు ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే బయటికొచ్చాయి.

అతియా-రాహుల్ ఇద్దరూ చాలాకాలంగా డేటింగులో ఉన్నారు. ఎల్లుండి (23న) వీరి వివాహం జరగనుండగా, వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పెళ్లి కోసం అందంగా అలంకరించిన మండపానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పచ్చని చెట్లతో నిండిన సునీల్ శెట్టి ఫామ్‌ హౌస్‌లో మండపాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.

రాహుల్-అతియా వివాహాన్ని చాలా అత్యంత రహస్యంగా జరగనున్నట్టు తెలుస్తోంది. కాక్‌టెయిల్ పార్టీతో ప్రి-వెడ్డింగ్ వేడుక ప్రారంభం కానుంది. ఆ తర్వాత మెహందీ, హల్దీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రెండు ఆదివారం (22న) జరిగే అవకాశం ఉంది. 23 కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది.

Updated Date - 2023-01-21T16:24:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising