ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెలూన్ షాపులోని బార్బర్ ఇలా సూటూ బూటు వేశాడేంటని అవాక్కవుతున్నారా..? ఈ కుర్రాడి డబుల్ యాక్షన్ వెనుక కారణమేంటో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-03-04T16:44:52+05:30

అతడికి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నాడు. సెలూన్ షాపులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి, నలుగురు తమ్ముళ్ల ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అతడికి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నాడు. సెలూన్ షాపులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి, నలుగురు తమ్ముళ్ల యోగక్షేమాలు చూసుకుంటున్నాడు. ఓవైపు సెలూన్ షాపులోని బార్బర్‌గా ఉంటూనే.. మరోవైపు సూటుబూటు వేసుకుని తన ఆశయ సాధన కోసం కూడా కృషి చేస్తున్నాడు. ఇంతకీ ఈ కుర్రాడి డబుల్ యాక్షన్ వెనుక కారణాల్లోకి వెళితే..

ఉత్తరాఖండ్ (Uttarakhand) అల్మోరాలోని కచారి బజార్‌కు చెందిన అకిబ్ అనే యువకుడికి తల్లి, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. అకిబ్‌కు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. ఇంట్లో అకిబ్ పెద్ద వాడు కావడంతో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. దీంతో పదేళ్ల వయసు ఉన్నప్పుడే బాధ్యతలను మీద వేసుకున్నాడు. స్థానికంగా ఉన్న సెలూన్ షాపులో (Salon shop work) పని చేయడం మొదలెట్టాడు. ఓ వైపు పని చేస్తూనే.. మరోవైపు చదువును కూడా కొనసాగించాడు. ఉదయం పని చేయడం, అనంతరం స్కూలుకు వెళ్లడం.. సాయంత్రం మళ్లీ షాపులో పని చేయడం చేసేవాడు.

ఎవరీ సంతోష్ మిశ్రా..? నెట్టింట వైరల్‌గా మారిన ఐపీఎస్ ఆఫీసర్ పెళ్లి ఫొటోలు.. అమెరికాలో రూ.50 లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు గుడ్‌బై చెప్పి..

రాత్రి ఇంటికి వచ్చాక పుస్తకాలు తీసుకుని చదువుకోవడం.. దినచర్యగా చేసుకున్నాడు. ఇంకో వైపు తన ఇద్దరు తమ్ముళ్లకూ బోధిస్తూ వచ్చాడు. ప్రస్తుతం అకిబ్ సొంతంగా సెలూన్ షాపు నడుపుతూనే బీఏ, ఎంఏ (BA, MA) పూర్తి చేశాడు. ఇతడికి మొదటి నుంచీ లాయర్ కావాలని కోరిక ఉండడంతో ప్రస్తుతం ఎల్ఎల్‌బీలో (LLB) అడ్మిషన్ తీసుకుని చదువును కొనసాగిస్తున్నాడు. పని చేయడం నామూషీగా భావించే ఈ రోజుల్లో.. నమ్ముకున్న వృత్తిని కొనసాగించడంతో పాటూ లాయర్ కావాలన్న తన కోరికను కూడా నెరవేర్చుకుంటున్న అకిబ్.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

నన్ను చంపేశారు.. రూ.25 కోట్లు పరిహారం ఇప్పించండంటూ హైకోర్టులో వింత కేసు.. నువ్వు దెయ్యానివి అనడానికి ఆధారాలు లేవంటూ..!

Updated Date - 2023-03-04T16:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!