ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Funny video: మీ ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందా.. అయితే ఇంటి నుంచి ఇలా ఈజీగా వెళ్లగొట్టండి..

ABN, First Publish Date - 2023-04-09T20:21:42+05:30

చాలా మంది తమ ఇళ్లల్లో ఎలుకల బెడదతో ఇబ్బందులు పడుతుంటారు. పల్లెల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కనపడిన ప్రతి ఎలుకనూ చంపేస్తుంటారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాదు. కొందరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చాలా మంది తమ ఇళ్లల్లో ఎలుకల బెడదతో ఇబ్బందులు పడుతుంటారు. పల్లెల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కనపడిన ప్రతి ఎలుకనూ చంపేస్తుంటారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాదు. కొందరు ఎలుకల బోన్లు పెట్టి మరీ వాటిని బంధిస్తుంటారు. మరికొందరు వివిధ రకాల మందులు పెట్టి.. ఎలుకలను చంపేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఓ మహిళ ఎలుకలకు ఎలాంటి హాని చేయకుండా ఇంటి నుంచి తరమికొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఎలుకల బెడదతో ఇబ్బంది పడుతున్న ఓ మహిళ (woman) .. వాటి నివారణకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఎలుకలకు ఎలాంటి హాని చేయకుండా ఇంటి నుంచి వెళ్లగొట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఓ విచిత్రమైన ప్లాన్ వేసింది. ఖాలీ వాటర్ బాటిళ్లను (Empty water bottles) తీసుకొచ్చి, గొలుసు తరహాలో ఏర్పాటు చేసుకుంది. వాటిని ఇంట్లోని గది నుంచి బయటి తలుపు వరకూ రెండు వరుసల్లో పెట్టింది. తర్వాత లోపలి నుంచి ఎలుకను కర్రతో అదిలిస్తూ వాటర్ బాటిళ్ల వరకూ తీసుకొచ్చింది.

Viral Video: నడి రోడ్డుపై యువతిని వెంటపడిన వ్యక్తి.. పదే పదే బలవంతం చేస్తుండగా.. చివర్లో సడన్‌గా ఏం జరిగిందంటే..

వేగంగా వచ్చిన ఎలుక (rat) .. బాటిళ్ల వరుస మధ్యన ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లింది. పక్కకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఆ మార్గం గుండా నేరుగా ఇంటి బయటికి వెళ్లిపోయింది. ఎలుక బయటికి వెళ్లగానే తలుపులు మూసేసింది. ఇలా ఆమె ఎలుకలు అన్నింటినీ బయటికి తరిమేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఏం ఐడియా వేశావమ్మా!.. అంటూ కొందరు, ఎలుకలను హాని చేయకుండా వెళ్లగొట్టిన మహిళ మంచితనాన్ని ప్రశంసిస్తూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Priyanka Chopra: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా మగాడిలా మారితే.. ఇదిగో అచ్చం ఇలా ఉంటాడట.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..!

Updated Date - 2023-04-09T20:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising