Priyanka Chopra: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా మగాడిలా మారితే.. ఇదిగో అచ్చం ఇలా ఉంటాడట.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..!

ABN , First Publish Date - 2023-04-09T16:05:13+05:30 IST

సృజనాత్మకత ఉండాలే గానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆన్‌లైన్ వేదికగా తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. అలాగే లక్షల్లో సంపాదన కూడా ఆర్జించవచ్చు. అయితే కొందరు ఇదే ఆన్‌లైన్‌ను ఉనయోగించుకుని నేరాలకు పాల్పడుతుంటారు. మరికొందరు ..

Priyanka Chopra: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా మగాడిలా మారితే.. ఇదిగో అచ్చం ఇలా ఉంటాడట.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..!

సృజనాత్మకత ఉండాలే గానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆన్‌లైన్ వేదికగా తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. అలాగే లక్షల్లో సంపాదన కూడా ఆర్జించవచ్చు. అయితే కొందరు ఇదే ఆన్‌లైన్‌ను ఉనయోగించుకుని నేరాలకు పాల్పడుతుంటారు. మరికొందరు యువతుల ఫొటోలను మార్ఫింగ్ చేసి, తద్వారా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతుంటారు. ఇంకొందరు పొటోషాప్‌లో అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వ్యక్తి ఎడిట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫొటో వైరల్ అవుతోంది. ప్రియాంకా చోప్రా మగాడిలా మారితే.. ఇదిగో అచ్చం ఇలా ఉంటాడట.. అంటూ విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో నటి ప్రియాంకా (Bollywood actress Priyanka Chopra) చోప్రాకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు (Viral videos) కొడుతోంది. జోస్ ఆంటోనియో సాలిబా అనే వ్యక్తికి ప్రియాంక చోప్రా ఫొటో చూడగానే ఓ ఆలోచన వచ్చింది. ఆమె మగాడిలా మారితే ఎలా ఉంటుందీ.. అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన ప్రతిభకు పదును పెట్టాడు. ముందుగా ఆమె కళ్లను కాస్త చిన్నవిగా చేశాడు. అనంతరం గడ్డం, ముక్కు, మొఖం ఆకారాన్ని కాస్త మార్చాడు.

Viral Video: ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా.. కారు డోరు తీయకుండానే లోపలకు ఎలా వెళ్లిపోయిందో మీరే చూడండి..!

చివరా మీసం, గడ్డం గీసి, మగవాళ్ల విగ్ తగిలించాడు. ఫైనల్‌గా చూడగా, ప్రియాంక చోప్రా కాస్త గుర్తు పట్టలేని విధంగా మగాడిలా మారిపోయింది. ఇలాంటి మనిషి ఒకరు ఉన్నారేమో.. అన్నంతలా ఆ ఫొటో ఉంటుంది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ప్రియాంక చోప్రాను.. మరింత అందమైన మగాడిలా మార్చారు’’.. అని కొందరు, ‘‘నీ టాలెంట్ అద్భుతం బ్రదర్’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.

Husband: భర్త వచ్చిన ప్రతీసారి ఆలస్యంగా నిద్రలేస్తున్న 16 ఏళ్ల కూతురు.. నిలదీస్తే రాత్రిళ్లు జరిగింది గుర్తు లేదన్న బాలిక.. అనుమానంతో..

Updated Date - 2023-04-09T16:05:13+05:30 IST