CCTV Video: రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సీన్.. రైలు కింద పడేందుకు దూకిన యువతి.. పక్కనే నిల్చున్న కుర్రాడు చేయి పట్టుకుని లాగాడు కానీ..

ABN , First Publish Date - 2023-04-07T20:43:10+05:30 IST

కొన్నిసార్లు కళ్ల ముందు సడన్‌గా షాకింగ్ ఘటనలు చోటు చేసుకునే సమయంలో చాలా మంది కళ్లప్పగించి చూస్తూ కదలకుండా ఉండిపోతారు. మరికొందరు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలీక నిశ్చేష్టులై ఉండిపోతారు. కానీ చాలా తక్కువ మంది అలాంటి సమయాల్లోనూ..

CCTV Video: రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సీన్.. రైలు కింద పడేందుకు దూకిన యువతి.. పక్కనే నిల్చున్న కుర్రాడు చేయి పట్టుకుని లాగాడు కానీ..

కొన్నిసార్లు కళ్ల ముందు సడన్‌గా షాకింగ్ ఘటనలు చోటు చేసుకునే సమయంలో చాలా మంది కళ్లప్పగించి చూస్తూ కదలకుండా ఉండిపోతారు. మరికొందరు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలీక నిశ్చేష్టులై ఉండిపోతారు. కానీ చాలా తక్కువ మంది అలాంటి సమయాల్లోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటి వారి వల్ల చాలాసార్లు చాలా మంది ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. ఇందుకు నిదర్శంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఓ యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. రైలు కింద పడేందుకు దూకుతుండగా.. అక్కడే ఉన్న యువకుడు చివరికి ఏం చేశాడంటే..

సోషల్ మీడియాలో ఓ యువతికి సంబంధించిన వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. రైల్వే స్టేషన్‌లో (Railway station) ప్రయాణికులంతా రైలు కోసం వేచి చూస్తూ ఉంటారు. వారితో పాటూ ఓ యువతి కూడా ముందు వైపు నిల్చుని రైలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో ట్రైన్ ప్లాట్‌ఫామ్ దగ్గరికి వస్తుంటుంది. దీన్ని గమనించిన యువతి (young woman) సడన్‌గా పట్టాల మీదకు దూకి ఆత్మహత్య (suicide) చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఒక్కసారిగా పట్టాల మీదకు పరుగు పెడుతుంది. ఆమె వెనుకే ఉన్న యువకుడు.. వెంటనే అలెర్ట్ అవుతాడు. ఏమాత్రం ఆలోచించకుండా ఆమె వెనుకే వేగంగా పరుగెత్తి వెనక్కు లాగే ప్రయత్నం చేస్తాడు.

Girl Viral Photo: చక్కగా ఫొటో దిగుతోంటే.. మధ్యలో ఈ కుర్రాళ్లు అడ్డొచ్చారు.. వాళ్లను కట్ చేసేయండని ఈ యువతి కోరితే..

ఆ టీషర్ట్ పట్టుకుని గట్టిగా వెనక్కు లాగేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ కిందపడతారు. అప్పటికే యువతి కాళ్లు రైలు తాకే విధంగా ఉంటాయి. దీంతో యువకుడు మరింతగా కూడగట్టుకుని గట్టిగా వెనక్కు లాగేస్తాడు. అప్పటికే రైలు యువతిని దాటి వెళ్తుంది. అయితే సరైన సమయానికి యువతిని వెనక్కు లాగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC camera) రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సరైన సమయానికి స్పందించి, యువతి ప్రాణాలను కాపాడిన యువకుడిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Married Couple: పెళ్లయిన 3 గంటలకే షాకింగ్ సీన్.. ఈ వధూవరులు పోలీస్ స్టేషన్ ముందు ఎందుకిలా కూర్చోవాల్సి వచ్చిందంటే..!

Updated Date - 2023-04-07T20:43:10+05:30 IST