Girl Viral Photo: చక్కగా ఫొటో దిగుతోంటే.. మధ్యలో ఈ కుర్రాళ్లు అడ్డొచ్చారు.. వాళ్లను కట్ చేసేయండని ఈ యువతి కోరితే..

ABN , First Publish Date - 2023-04-07T18:59:37+05:30 IST

సోషల్ మీడియా ప్రభావం యువతీయువకుల మీద ఎంత మేర ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరైతే, నిత్యం ఆన్‌లైన్‌లో ఉంటూ కనీసం కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడపలేని పరిస్థితిలో ఉంటారు. యువకులతో పాటూ చాలా మంది యువతులు..

Girl Viral Photo: చక్కగా ఫొటో దిగుతోంటే.. మధ్యలో ఈ కుర్రాళ్లు అడ్డొచ్చారు.. వాళ్లను కట్ చేసేయండని ఈ యువతి కోరితే..

సోషల్ మీడియా ప్రభావం యువతీయువకుల మీద ఎంత మేర ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరైతే, నిత్యం ఆన్‌లైన్‌లో ఉంటూ కనీసం కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడపలేని పరిస్థితిలో ఉంటారు. యువకులతో పాటూ చాలా మంది యువతులు కూడా నిత్యం ఆన్‌లైన్‌లోనే గడపడం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కొందరు యువతులు చేసే పిచ్చి పిచ్చి పనులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన ఫొటో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. సదరు యువతి ఫొటో దిగుతుండగా కొందరు కుర్రాళ్లు అడ్డొచ్చారు. చివరకు ఫొటో చూసుకున్న యువతికి ఓ సిల్లీ కోరిక పుట్టింది. మధ్యలో అడ్డొచ్చిన కుర్రాళ్లను కట్ చేయమని నేరుగా నెటిజన్లను కోరింది. చివరకు ఏమైందంటే..

సోషల్ మీడియాలో ఓ యువతికి సంబంధించిన ఫొటోను (young women Viral photos) నెటిజన్లు ఎడిటింగ్ చేసే పనిలో పడ్డారు. ఎవరికి వారు వారి ప్రతిభకు పని పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మారుస్తుండడంతో ప్రస్తుతం ఈ యువతి ఫొటోపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఓ యువతి ఢిల్లీలోని (Delhi) ఖాన్ బజార్‌లో ఫొటో దిగింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఫొటో చూసుకున్న యువతికి మాత్రం నచ్చలేదు. ఫొటోలో ఆమె ఎదురుగా ఇద్దరు కుర్రాళ్లు ఉండడం ఆమెకు ఇబ్బంది కలిగించింది. ఈ ఫొటోను తన సోషల్ మీడియాలో (Social media) అకౌంట్లలో షేర్ చేస్తూ.. నెటిజన్లను సిల్లీ కోరిక కోరింది.

Husband Love Letter: ఇంటిని శుభ్రం చేస్తోంటే బయటపడ్డ ‘భర్త లవ్ లెటర్’.. 18 ఏళ్ల క్రితం నాటి ఆ లేఖను చదివి ఆ భార్య ఏం చేసిందంటే..

women-viral.jpg

‘‘నా ఎదురుగా కుర్రాళ్లు ఉండడం నాకు నచ్చలేదు. దయచేసి ఈ ఇద్దరినీ కట్ చేయండి’’.. అంటూ నెటిజన్లను కోరింది. అడక్కడక్క అమ్మాయి అడగడంతో నెటిజన్లు వెంటనే రంగంలోకి దిగారు. ఎవరికి తోచినట్లుగా వారు ఆ ఫొటోను ఎడిట్ చేసి పడేశారు. అనంతరం ‘‘ మా ఎడిటింగ్ మీకు నచ్చిందా’’.. అంటూ ఆ ఫొటోను షేర్ చేస్తూ వచ్చారు. కొందరు యువతి ఎక్కడో అడవిలో ఉన్నట్లు చూపిస్తే.. మరికొందరు కుక్కపిల్లలు, పిల్లి పిల్లుల ఎదురుగా ఉన్నట్లు ఎడిట్ చేశారు. ఇలా ఆమె ముందున్న ఇద్దరు కుర్రాళ్లను తీసేసి, ఆ స్థానంలో అందమైన ప్రదేశాలు ఉండేలా ఫొటోను మార్ఫింగ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ యువతి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు దీనిపై చాలా మంది నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Married Couple: పెళ్లయిన 3 గంటలకే షాకింగ్ సీన్.. ఈ వధూవరులు పోలీస్ స్టేషన్ ముందు ఎందుకిలా కూర్చోవాల్సి వచ్చిందంటే..!

Updated Date - 2023-04-07T18:59:37+05:30 IST