Viral Video: బావిలో ప్రాణాలతో పోరాడుతున్న పులి.. అంతలో మీదికి ఎక్కి కూర్చున్న కుక్క.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-04-06T21:10:46+05:30 IST

క్రూర మృగాలకు ఏ జంతువు కనపడ్డా.. తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే. అప్పడప్పుడూ టైం బాగుండి ప్రాణాలతో బయటపడుతుంటాయి తప్ప.. మిగతా సమయంలో ఎలాంటి జంతువైనా పులులు, సింహాలకు ఆహారం కావాల్సిందే. ఇందుకు..

Viral Video: బావిలో ప్రాణాలతో పోరాడుతున్న పులి.. అంతలో మీదికి ఎక్కి కూర్చున్న కుక్క.. చివరకు ఏం జరిగిందంటే..

క్రూర మృగాలకు ఏ జంతువు కనపడ్డా.. తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే. అప్పడప్పుడూ టైం బాగుండి ప్రాణాలతో బయటపడుతుంటాయి తప్ప.. మిగతా సమయంలో ఎలాంటి జంతువైనా పులులు, సింహాలకు ఆహారం కావాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ప్రస్తుతం ఓ ఆశ్చర్యకర ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పులి పొరపాటున బావిలో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. అంతలో కుక్క కూడా తన ప్రాణాలు కాపాడుకునేందుకు పులిపైకి ఎక్కింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో పులి, కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఎలా వచ్చి పడ్డాయో ఏమో తెలీదు గానీ.. ఓ పులి, కుక్క బావిలో పడిపోతాయి. అందులో నీరు ఎక్కువగా ఉండడం, బయటికి వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు పులి (tiger) పక్కనే ఉన్న ఓ ఇనుప పైపు సందులోకి దూరుతుంది. దాదాపు ప్రాణాల మీద ఆశలు వదులుకున్న పులి.. చివరి ప్రయత్నంగా నీటిలో తేలుతూ ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతలో కుక్క (dog) కూడా తన ప్రాణాలు కాపాడుకునేందుకు అటూ ఇటూ చూసి, చివరకు చేసేదేమీ లేక పులి వద్దకు వస్తుంది. నీటిలో మునగకుండా ఉండేందుకు... అప్పటికే అసలిపోయి ఉన్న పులి మీద కాలు పెట్టి గట్టిగా పట్టుకుంటుంది.

Disabled Child Video: నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో.. ఈ 5 ఏళ్ల పిల్లాడు నడిస్తే వింతేంటంటారా..? ఇతడి కథేంటో తెలిస్తే..

ఆ క్షణంలో కుక్క వైపు దీనంగా చూసిన పులి.. ‘‘నా టైం బాలేదు కాబట్టి బతికిపోయావ్.. లేదంటే నిన్నూ’’.. అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. అక్కడున్నది పులి అని, తనను చంపేస్తుందని తెలిసినా.. కుక్క తన ప్రాణాలు కాపాడుకునేందుకు పులిపైనే పడుకోవాల్సి వస్తుంది. అయితే చివరకు అధికారులు ఈ రెండింటినీ రక్షించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను బావి పైన ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో శత్రుత్వాలు, జాతివైరాలు.. చివరకు ఆకలిదప్పులు కూడా ఉండవంటే ఇదేనేమో!.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: షాపింగ్ మాల్‌కు వెళ్లగానే మొదటగా చేసే పనేంటి..? సరుకులకై ట్రాలీని తీసుకునే వాళ్లు తప్పక చూడాల్సిన వీడియో..!

Updated Date - 2023-04-06T21:10:46+05:30 IST