Viral Video: అది పిల్లి కాదమ్మా.. పులి.. ఆ యువతి హగ్గులిస్తూ ముద్దులు కూడా పెడుతోంటే.. ఆ పులి ఏం చేసిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-04-06T15:38:21+05:30 IST

పేరుకు క్రూర జంతువులైనా కొన్నింటిని చూస్తే పైకి అలా కనిపించవు. సాధు జంతువుల తరహాలో ముద్దొస్తుంటాయి. అలాగని ఆడుకోవాలని ప్రయత్నిస్తే.. వాటిలోని క్రూరత్వాన్ని బయటపెడతాయి. ఒక్క దెబ్బతో మనుషులను కాస్త.. మాంసపు ముద్దలను చేసి మింగేస్తాయి. కానీ కొందరు మాత్రం...

Viral Video: అది పిల్లి కాదమ్మా.. పులి.. ఆ యువతి హగ్గులిస్తూ ముద్దులు కూడా పెడుతోంటే.. ఆ పులి ఏం చేసిందో మీరే చూడండి..!

పేరుకు క్రూర జంతువులైనా కొన్నింటిని చూస్తే పైకి అలా కనిపించవు. సాధు జంతువుల తరహాలో ముద్దొస్తుంటాయి. అలాగని ఆడుకోవాలని ప్రయత్నిస్తే.. వాటిలోని క్రూరత్వాన్ని బయటపెడతాయి. ఒక్క దెబ్బతో మనుషులను కాస్త.. మాంసపు ముద్దలను చేసి మింగేస్తాయి. కానీ కొందరు మాత్రం పులులు, సింహాలు తదితర క్రూర జంతువులతో ఆటలు ఆడుకోవడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. చూసేందుకు టెడ్డీబేర్ కనిపిస్తున్న పులి.. ఓ యువతిని తెగ ఆకట్టుకుంది. దీంతో ముందూ వెనుకా చూడకుండా పులికి హగ్గులిస్తూ, ముద్దులు కూడా పెట్టింది. ఆ సమయంలో పులి ఏం చేసిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో పులి, యువతికి సంబంధించిన వీడియో వైరల్‌గా (Viral videos) మారింది. ఎన్‌క్లోజర్‌లో ప్రశాంతంగా పడుకుని ఉన్న ఓ పెద్ద పులి (tiger) చూసేందుకు అచ్చం టెడ్డీబేర్‌లా (teddy bear) ఉంటుంది. దీంతో అక్కడే ఉన్న యువతికి పులి తెగ నచ్చేస్తుంది. ‘‘అరే! ఎంత ముద్దుగా ఉంది’’.. అనుకుంటూ దాని వద్దకు వెళ్తుంది. ఆ సమయంలో పులి కూడా చాలా కూల్‌గా ఉంటుంది. పులి మెడపై చేత్తో చాలా సేపు నిమిరిన యువతి.. తర్వాత క్యూట్ టైగర్.. అంటూ ప్రేమగా హగ్ చేసుకుంటుంది. అంతటితో ఆగకుండా పులిపై ముద్దుల (young woman kissed the tiger) వర్షం కురిపిస్తుంది.

Husband Love Letter: ఇంటిని శుభ్రం చేస్తోంటే బయటపడ్డ ‘భర్త లవ్ లెటర్’.. 18 ఏళ్ల క్రితం నాటి ఆ లేఖను చదివి ఆ భార్య ఏం చేసిందంటే..

యువతి అంత ఇబ్బంది పెడుతున్నా.. పులి ఏమీ అనకుండా చిన్న పిల్లిలా మారిపోతుంది. యువతి చూపించిన ప్రేమకు ఫిదా అయినట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘జాగ్రత్త తల్లో.. అది పిల్లి కాదు.. పెద్ద పులి’’.. అంటూ కొందరు, ‘‘ఈ పులి చాలా వెరైటీగా ఉన్నట్టుందే’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో రోజుల వ్యవధిలోనే వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral Videos: ఓరి నాయనో.. మెట్రో రైళ్లలో ఇన్ని కళాఖండాలా..? డ్రస్సుల నుంచి ముద్దు సీన్ల వరకు ఎన్ని నిర్వాకాలు జరిగాయో మీరే చూడండి..!

Updated Date - 2023-04-06T15:38:21+05:30 IST