Viral Video: మెట్రో ట్రైన్లోంచి దిగిన వెంటనే ఓ యువతి వింత చేష్టలు.. అమ్మా.. తల్లీ.. నువ్విలా అందరినీ భయపెట్టొద్దంటూ నెట్టింట ఫన్నీ సెటైర్లు..!

ABN , First Publish Date - 2023-04-05T15:30:53+05:30 IST

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం.. రద్దీగా ఉండే ప్రదేశాల్లో వింత వింత చేష్టలు చేస్తూ.. అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం సర్వసాధారణంగా మారింది. యువకులే అనుకుంటే కొందరు యువతులు కూడా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. మెట్రో రైల్లో..

Viral Video: మెట్రో ట్రైన్లోంచి దిగిన వెంటనే ఓ యువతి వింత చేష్టలు.. అమ్మా.. తల్లీ.. నువ్విలా అందరినీ భయపెట్టొద్దంటూ నెట్టింట ఫన్నీ సెటైర్లు..!

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం.. రద్దీగా ఉండే ప్రదేశాల్లో వింత వింత చేష్టలు చేస్తూ.. అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం సర్వసాధారణంగా మారింది. యువకులే అనుకుంటే కొందరు యువతులు కూడా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. మెట్రో రైల్లో ఉన్నట్టుండి పిచ్చ పట్టినట్లుతా డాన్సులు చేసే యువతుల వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మెట్రో స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఓ యువతి వింత చేష్టలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘అమ్మా.. తల్లీ.. నువ్విలా అందరినీ భయపెట్టొద్దు’’.. అటూ నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ యువతికి సంబంధించిన వీడియో తెగ వైరల్ (young woma viral videos) అవుతోంది. ముంబై మెట్రో స్టేషన్‌లో (Mumbai Metro Station) ఓ రైలు వచ్చి ఆగింది. ఎక్కి, దిగే ప్రయాణికులతో రైలు (train) రద్దీగా ఉంది. ఇంతలో రెడ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించిన ఓ యువతి.. సడన్‌గా ప్లాట్‌ఫామ్ పైకి వస్తుంది. ఉన్నట్టుండి పిచ్చి పట్టిన వారిలా బిహేవ్ చేస్తుంది. అటూ ఇటూ పరుగెత్తుతూ ఏవేవో కుప్పిగంతులు వేస్తుంది. యువతి ప్రవర్తనకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. కొందరు మహిళలు యువతిని వారించే ప్రయత్నం చేసినా ఆమె మాత్రం అసలు వినిపంచుకోదు. కింద కూర్చుని కొద్ది సేపు, ప్రయాణికులను (Passengers) భయభ్రాంతులకు గురి చేస్తూ డాన్సు వేస్తుంది.

Viral Video: ఉన్నట్టుండి పెళ్లికి ముందు వీడియో ప్రదర్శించగానే అవాక్కైన వధువు.. పెళ్లి మంటపంలో బిగ్ స్క్రీన్‌పై అంతా చూస్తుండగా..

దీంతో ఎక్కడ తమను కింద పడేస్తుందో అని అంతా దూరంగా వెళ్లిపోతారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన డాన్సు గతంలో ఎన్నడూ చూడలేదు.. అని కొందరు, ఇన్నాళ్లూ జంతువులను చూసి భయపడ్డాం.. మొదటి సారి మనిషిని చూసి భయపడాల్సి వచ్చింది.. అని ఇంకొందరు, ఇలాంటి వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) డిస్‌లైక్ ఆప్షన్ కూడా ఉండుంటే బాగుండు.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుం ఈ వీడియో లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Metro Train Video: బాబోయ్.. ఇదేం అరాచకం.. ఈ యువతి డ్రస్సు వేసుకుపోవడం మర్చిపోయి మెట్రో రైల్ ఎక్కిందా ఏంటి..? నెటిజన్ల ఘాటు కామెంట్స్..!

Updated Date - 2023-04-05T15:30:53+05:30 IST