Labour Pains in Train: ఓ నిండు గర్భిణి రైలు ప్రయాణం.. సడన్‌గా పురిటి నొప్పులు.. డాక్టర్ కాదు కదా నర్సు కూడా లేరు కానీ..

ABN , First Publish Date - 2023-04-01T20:57:15+05:30 IST

నడి రోడ్డుపై, అంబులెన్స్‌లు, కార్లు.. ఇలా అనూహ్య ప్రాంతాల్లో మహిళ ప్రసవానికి సంబంధించిన ఘటనలు రోజూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. ప్రస్తుతం ఓ గర్భిణికి ఇలాంటి సమస్యే ఎదురైంది. ఓ నిండు గర్భిణి తన బావతో కలిసి రైల్లో ప్రయాణం చేస్తుండగా..

Labour Pains in Train: ఓ నిండు గర్భిణి రైలు ప్రయాణం.. సడన్‌గా పురిటి నొప్పులు.. డాక్టర్ కాదు కదా నర్సు కూడా లేరు కానీ..
ప్రతీకాత్మక చిత్రం

నడి రోడ్డుపై, అంబులెన్స్‌లు, కార్లు.. ఇలా అనూహ్య ప్రాంతాల్లో మహిళ ప్రసవానికి సంబంధించిన ఘటనలు రోజూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. ప్రస్తుతం ఓ గర్భిణికి ఇలాంటి సమస్యే ఎదురైంది. ఓ నిండు గర్భిణి తన బావతో కలిసి రైల్లో ప్రయాణం చేస్తుండగా.. సడన్‌గా పురటి నొప్పులు వచ్చాయి. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా కంగారుపడ్డారు. సమయానికి డాక్టర్లు, కనీసం నర్సులు కూడా లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అంతా అందోళన చెందుతున్న సమయంలో చివరకు అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బీహార్ (Bihar) వైశాలి జిల్లా కైలాష్ గ్రామానికి చెందిన గర్భిణి (pregnant) ప్రతిమకుమారి.. ఇటీవల ఆమె తన బావ ప్రమోద్ కుమార్‌తో కలిసి సికింద్రాబాద్-దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (Secunderabad-Danapur Express) రైలు ఎక్కింది. రైలు ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) దిల్దార్‌నగర్‌ నుంచి రైలు బయలుదేరింది. అప్పటికే నెలల నిండిన ప్రతిమ కుమారికి రైలు బయలుదేరిన కాసేపటికే పురిటినొప్పులు (Labour Pains) ప్రారంభమయ్యాయి. దీంతో బోగీలో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. ఆమెకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. బోగీలో వైద్యులు కానీ, కనీసం నర్సులు కూడా లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక.. ప్రయాణికులంతా కంగారుపడుతున్నారు. ఇంతలో ఓ ప్రయాణికుడు రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు.

Viral Video: అయ్యయ్యో.. వరి చేలో ఈ భార్యాభర్తలు ఇలా దొరికిపోయారేంటి..? ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీయడంతో..

అదే సమయంలో బోగీలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ (woman constable) రబ్రీదేవి అక్కడికి వచ్చింది. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు గర్భిణికి సేవలు చేసింది. రైలు బక్సర్ అనే ప్రాంతానికి చేరుకునేలోపు మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రైలు బక్సర్ స్టేషన్‌లోనే 38 నిముషాల పాటు నిలిపేయాల్సి వచ్చింది. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గర్భిణికి మానవత్వంతో సేవలు చేసిన మహిళా కానిస్టేబుల్‌ను అంతా ప్రశంసలతో ముంచెత్తారు. కాగా, రైల్లో మహిళ ప్రసవానికి సంబంధించిన వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయంశమైంది.

Bride Video: పెళ్లి ఫొటోల కోసం సరదాగా ఇలా ఫోజులు పెట్టడమే ఈ వధూవరుల కొంపముంచింది.. అప్పటిదాకా హ్యాపీగానే ఉన్నారు కానీ..

Updated Date - 2023-04-01T20:57:15+05:30 IST