Shocking Video: అమ్మ బాబోయ్.. మృత్యువు అంచును మిల్లీసెకన్ల దూరంలో మిస్సవడం అంటే ఇదేనేమో.. ఈ బైకుల వీడియోను చూస్తే..!

ABN , First Publish Date - 2023-04-01T17:10:47+05:30 IST

అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది. అలాగే భూమ్మీద నూకలు మిగిలుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఏమీ కాదు. చిన్న చిన్న ప్రమాదాల సమయంలోనూ కొన్నిసార్లు ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరికొన్నిసార్లు..

Shocking Video: అమ్మ బాబోయ్.. మృత్యువు అంచును మిల్లీసెకన్ల దూరంలో మిస్సవడం అంటే ఇదేనేమో.. ఈ బైకుల వీడియోను చూస్తే..!

అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది. అలాగే భూమ్మీద నూకలు మిగిలుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఏమీ కాదు. చిన్న చిన్న ప్రమాదాల సమయంలోనూ కొన్నిసార్లు ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరికొన్నిసార్లు కొందరు ప్రమాదపు అంచుల వరకూ వెళ్లి క్షేమంగా బయటపడడం తరచూ చూస్తూ ఉంటాం. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మృత్యువు నుంచి మీల్లీ మీటర్ దూరంలో బయటపడిన బైకర్లను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

నాలుగు రోడ్ల కూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కూడలి వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్ లైట్లు (Signal lights) సరిగా పనిచేయని కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వచ్చీపోయే వాహనాలతో (Vehicles) రోడ్డు రద్దీగా ఉంటుంది. కొందరు బైకర్లు అటూ ఇటూ చూసుకుంటూ వాహనాలు లేని సమయంలో రోడ్డు దాటుతుంటారు. మరికొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఇద్దరు బైకర్లు (Bikers) చెరో వైపు వేగంగా వస్తుంటారు. సరిగ్గా నాలుగు రోడ్ల కూడలి వద్ద దాదాపు ఢీకొనేంత వరకూ వెళ్తారు.

Viral Video: చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఇదేం నిర్వాకం.. పెళ్లి పేరుతో వింత చేష్టలు.. విద్యార్థులపై మండి పడుతున్న నెటిజన్లు..!

అయితే అదృష్టం బాగుండి.. జస్ట్ మిల్లీమీటర్ గ్యాప్‌లో రెండు వాహనాలు క్రాస్ అవుతాయి. అయితే ఈ ఘటనతో వారు కూడా షాక్ అవుతారు. ఇద్దరూ ఒకనినొకరు.. తప్పు నీదంటే నీది.. అన్నట్లుగా చూసుకుంటూ అంతే వేగంతో ఆగకుండా వెళ్లిపోతారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC cameras) రికార్డు అవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరిగేది.. అంటూ కొందరు, వీరికి భూమ్మీద నూకలు ఉన్నాయి.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Bride Video: పెళ్లి ఫొటోల కోసం సరదాగా ఇలా ఫోజులు పెట్టడమే ఈ వధూవరుల కొంపముంచింది.. అప్పటిదాకా హ్యాపీగానే ఉన్నారు కానీ..

Updated Date - 2023-04-01T17:10:47+05:30 IST