Viral Video: అయ్యయ్యో.. వరి చేలో ఈ భార్యాభర్తలు ఇలా దొరికిపోయారేంటి..? ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీయడంతో..

ABN , First Publish Date - 2023-03-31T15:34:47+05:30 IST

ఒకప్పుడు ఎంతో పెద్ద సంఘటన అయితే తప్ప వార్తలకెక్కేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మారుమూల గ్రామాల్లో చీమ చిటుక్కుమన్నా.. ఇట్టే సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోల రూపంలో వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం ..

Viral Video: అయ్యయ్యో.. వరి చేలో ఈ భార్యాభర్తలు ఇలా దొరికిపోయారేంటి..? ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీయడంతో..

ఒకప్పుడు ఎంతో పెద్ద సంఘటన అయితే తప్ప వార్తలకెక్కేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మారుమూల గ్రామాల్లో చీమ చిటుక్కుమన్నా.. ఇట్టే సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోల రూపంలో వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి.. ఎక్కడ ఏ విచిత్రం జరిగినా ఇలా వీడియో తీసి, అలా సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. వీటిలో కొన్ని వీడియోలు లక్షలు, మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంటుంటాయి. ఇక మహిళలకు సంబంధించిన వీడియోలైతే.. తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం భార్యాభర్తలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వరి చేలో ఉన్న భార్యాభర్తలను ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వరి పొలంలో పనులు చేసుకునేందుకు వెళ్లిన భార్యాభర్తల (husband and wife) మధ్య.. సడన్‌గా గొడవ చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో భార్యపై ఆగ్రహానికి (Wife is angry) గురైన భర్త.. ఆమె మెడపై చేయి వేసి, కింద పడేయాలని చూస్తాడు. అయితే ఆమె మాత్రం చివరకు భర్తనే కింద పడేస్తుంది. అయితే ఆమె మాత్రం చివరకు భర్తనే కింద పడేస్తుంది. నన్నే కొడతావా... అంటూ బూతులు తిడుతూ ఎడాపెడా దాడి చేస్తుంది. అంతే కోపంతో జుట్టు పట్టుకుని (Wife assaults husband) ఫెడేల్‌మని కొడుతుంది.

Viral News: ఏంటీ.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నాతో చాటింగ్ చేస్తున్నాడా..? ఒక్క క్షణం అవాక్కైన వ్యక్తి.. చివరగా వచ్చిన మెసేజ్‌ను చూసి షాక్..!

భార్య కొట్టిన దెబ్బలకు.. ‘‘చచ్చాన్రో దేవుడో.. బాబోయ్.. నన్ను వదిలేయ్’’.. అంటూ వృద్ధుడు గట్టిగా కేకలు పెడతాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వారిని విడిపించక పోగా.. ఘటనను మొత్తం సినిమా షూటింగ్ తరహాలో వీడియో తీస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా (Viral videos) మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అవ్వ కోపం చూస్తుంటే.. ఈ తాత ఏ తప్పు చేశాడో అర్థం కావడం లేదు.. అంటూ కొందరు, ‘‘అసలు వీడికి బుద్ధి ఉందా.. అలా వీడియో తీయకపోతే.. వెళ్లి విడిపించవచ్చుగా’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైక్‌ను సొంతం చేసుకుంది.

Wife: ఏం చేయమంటారు..? నా భర్త వికలాంగుడు.. నేను ఇలాంటి పనులు చేస్తేనే ఇల్లు గడుస్తుందంటూ.. పోలీసులకు తేల్చిచెప్పిన ఈ మహిళ కథేంటంటే..

Updated Date - 2023-03-31T15:37:28+05:30 IST