Viral Video: ప్రశ్నల నెంబర్లు వేసి మరీ టీచర్‌ను పొగుడుతూ సమాధానాలు.. ఆ విద్యార్థికి పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తే..

ABN , First Publish Date - 2023-04-01T17:45:38+05:30 IST

పరీక్షల సమయంలో కొందరు విద్యార్థులు చేసే వింత వింత పనులు.. కొన్నిసార్లు ఆగ్రహాన్ని తెప్పిస్తే, మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. చాలా మంది విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తూ.. చివరకు పరీక్షల సమయం దగ్గరపడేసరికి తెగ గాబరా పడిపోతుంటారు. ఈ క్రమంలో..

Viral Video: ప్రశ్నల నెంబర్లు వేసి మరీ టీచర్‌ను పొగుడుతూ సమాధానాలు.. ఆ విద్యార్థికి పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తే..

పరీక్షల సమయంలో కొందరు విద్యార్థులు చేసే వింత వింత పనులు.. కొన్నిసార్లు ఆగ్రహాన్ని తెప్పిస్తే, మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. చాలా మంది విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తూ.. చివరకు పరీక్షల సమయం దగ్గరపడేసరికి తెగ గాబరా పడిపోతుంటారు. ఈ క్రమంలో కొందరు కాపీలు కొట్టి పరీక్షపలు రాస్తే.. మరికొందరు తమకు తోచింది రాసి మమ అనిపిస్తుంటారు. అయితే ఇంకొందరు విద్యార్థులు తుంటరి చేష్టలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ప్రస్తుతం ఓ విద్యార్థి పరీక్ష రాసే క్రమంలో ప్రశ్నల నెంబర్లు వేసి మరీ టీచర్‌ను పొగుడుతూ సమాధానాలు ఇచ్చాడు. ఆ విద్యార్థికి పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral Videos) అవుతోంది. ఓ విద్యార్థి పరీక్ష కేంద్రంలోకి (Examination Center) అందరిలాగే ఎంతో కాన్ఫిడెన్స్‌తో అడుగుపెడతాడు. అయితే ప్రశ్నపత్నం చూడగానే ఏం రాయాలో తెలీక బిక్కమొఖం వేస్తాడు. అయితే ఏదోటి రాసి.. టీచర్ మెప్పు పొందాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఓ వింత ఐడియా వస్తుంది. ఇంకేముందీ.. పేపర్‌పై పెన్ను పెట్టి రాయడం మొదలుపెడతాడు. ప్రశ్నలకు సమాధానాలు (Answers to questions) రాస్తున్నాడేమో.. అని అంతా అనుకుంటుంటే, అతడు మాత్రం విచిత్రంగా పాటలు రాయడం మొదలెట్టాడు. అన్ని ప్రశ్నలకు కలిపి మూడే మూడు సమాధానాలతో సరిపెట్టాడు.

Viral Video: అయ్యయ్యో.. వరి చేలో ఈ భార్యాభర్తలు ఇలా దొరికిపోయారేంటి..? ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీయడంతో..

అందులో మొదటి సమాధానంగా.. త్రీ ఇడియట్స్ (Three idiots) చిత్రం నుంచి "గివ్ మీ సమ్ సన్‌షైన్; గివ్ మి సమ్ రెయిన్; గివ్ మి అదర్ ఛాన్స్; ఐ వాన్నా గ్రో అప్ వన్స్ ఎగైన్" అనే పాట రాశాడు. అలాగే రెండో సమాధానంగా ఉపాధ్యాయురాలిని పొగుడుతూ ‘‘మేడమ్, మీరు అద్భుతమైన ఉపాధ్యాయులు. నేను కష్టపడి చదవలేకపోవడం నా తప్పే. దేవుడా, నాకు కొంత ప్రతిభను ప్రసాదించు".. అని రాశాడు. అలాగే చివరి సమాధానంగా మళ్లీ హిందీ చిత్రం PK (hindi pk cinema) నుండి "భగవాన్ హై కహాన్ రే తూ" పాట రాసి ముగించాడు. అయితే దీనిపై ఉపాధ్యాయురాలి రియాక్షన్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అన్నింటికీ సున్నా మార్కులు వేసిన టీచర్.. ‘‘గుడ్, అయితే మీరు మరిన్ని సమాధానాలు రాసుంటే బాగుండేది’’ అని రాశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Bride Video: పెళ్లి ఫొటోల కోసం సరదాగా ఇలా ఫోజులు పెట్టడమే ఈ వధూవరుల కొంపముంచింది.. అప్పటిదాకా హ్యాపీగానే ఉన్నారు కానీ..

Updated Date - 2023-04-01T17:53:37+05:30 IST