Love Holidays: ప్రేమించుకునేందుకు విద్యార్థులకు సెలవులు.. వారం రోజుల పాటు ఎంజాయ్ చేయండంటూ.. సూచనలు ఇచ్చి మరీ..

ABN , First Publish Date - 2023-04-02T19:32:30+05:30 IST

విద్యార్థులకు నీతి పాఠాలు బోధించాల్సింది పోయి.. ప్రేమ పాఠాలు చెప్పడం ఏంటీ, అందులోనూ ప్రేమించుకోండి అంటూ వారం రోజుల పాటు సెలవులు ఇవ్వడం ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా. కానీ ఇది అక్షరాలా నిజం. జననాల రేటు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ..

Love Holidays: ప్రేమించుకునేందుకు విద్యార్థులకు సెలవులు.. వారం రోజుల పాటు ఎంజాయ్ చేయండంటూ.. సూచనలు ఇచ్చి మరీ..
ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థులకు నీతి పాఠాలు బోధించాల్సింది పోయి.. ప్రేమ పాఠాలు చెప్పడం ఏంటీ, అందులోనూ ప్రేమించుకోండి అంటూ వారం రోజుల పాటు సెలవులు ఇవ్వడం ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా. కానీ ఇది అక్షరాలా నిజం. జననాల రేటు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాదీ ఏప్రిల్ నెలలో వారం రోజుల పాటు సెలవులు ఇస్తామని చెప్పింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. ప్రేమను కూడా ఆస్వాదించండి.. అని చెబుతున్న ఆ దేశం ఏది, జననాల రేటును పెంచేందుకు వారు తీసుకున్న చర్యలు ఏంటీ.. తదితర వివరాల్లోకి వెళితే..

కరోనా మొదలైనప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్న చైనా (China) .. మళ్లీ సంచలన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జననాల రేటు (Birth rate) పెంచేందుకు ఏకంగా విద్యార్థులకు వారం రోజుల పాటు లవ్ హాలిడేస్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది. మియాన్యాంగ్ ఫ్లయింగ్ వొకేషనల్ కాలేజ్ విద్యార్థులకు ఏప్రిల్ 1నుంచి 7వరకు వంత విరామాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా జీవితాన్ని ప్రేమిస్తూ, ప్రేమను ఆస్వాదిస్తూ.. డైరీలు రాయడం, ప్రయాణ వీడియోలు తయారు చేయడం వంటి పనులు చేయాలని సూచించారు. పచ్చని ప్రదేశాలు, కొండ ప్రాంతాలకు వెళ్లి వసంత కాలాన్ని ఎంజాయ్ చేయమంటూ కాలేజీ యాజమాన్యం తెలిపింది.

Marriage: యాక్సిడెంట్‌లో మొదటి భర్త చనిపోవడం వల్ల వచ్చే పరిహారానికి రెండో పెళ్లి చేసుకున్న భార్య అర్హురాలేనా..? హైకోర్టు ఏం తేల్చిందంటే..

పలు కళాశాలలు, విద్యా సంస్థలతో పాటూ చైనా ప్రభుత్వం కూడా జననాల రేటును పెంచేందుకు అనేక సిఫార్సులు ప్రకటిస్తోంది. ఒకే బిడ్డ విధానాన్ని విధించినప్పటి నుంచి చైనాలో జననాల రేటు బాగా పడిపోయిది. ఇక కరోనా ఆవిర్భావం తర్వాత జనాభా మరింతగా క్షీణించింది. దీంతో ఎలాగైనా జననాల రేటును పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది. ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు వివిధ రాయితీలు ప్రకటిస్తున్నా.. పిల్లల పోషణ, విద్య తదితరాలకు సంబంధించిన ఖర్చులకు భయపడి ఎక్కుమంది ముందుకు రావడం లేదు. కాగా, ప్రస్తుతం విద్యార్థులకు లవ్ హాలిడేస్ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bride Video: పెళ్లి ఫొటోల కోసం సరదాగా ఇలా ఫోజులు పెట్టడమే ఈ వధూవరుల కొంపముంచింది.. అప్పటిదాకా హ్యాపీగానే ఉన్నారు కానీ..

Updated Date - 2023-04-02T19:32:30+05:30 IST