Viral Video: ముందో యువతి, వెనుకో యువతి.. బైకుపై వెళ్తూ రాత్రి వేళ, నడి రోడ్డుపై ఇతడు చేసిన నిర్వాకంపై మండిపడుతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2023-04-02T15:39:32+05:30 IST

అందరి దృష్టిలో పడాలనే ఉద్దేశంతో కొందరు యువకులు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. మరికొందరు యువతుల ముందు ఫోజులు కొడుతూ వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి ..

Viral Video: ముందో యువతి, వెనుకో యువతి.. బైకుపై వెళ్తూ రాత్రి వేళ, నడి రోడ్డుపై ఇతడు చేసిన నిర్వాకంపై మండిపడుతున్న నెటిజన్లు..

అందరి దృష్టిలో పడాలనే ఉద్దేశంతో కొందరు యువకులు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. మరికొందరు యువతుల ముందు ఫోజులు కొడుతూ వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువకుడు ఇద్దరు యువతులను బైకుపై ఎక్కించుకుని మరీ విన్యాసాలు చేసిన వీడియో వైరల్ అవుతోంది. బైకుపై ముందో యువతి, వెనుకో యువతిని ఎక్కించుకుని రాత్రి వేళ నడి రోడ్డుపై ఇతడు చేసిన నిర్వాకంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ముంబైలో (Mumbai) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బైకుపై ఇద్దరు యువతులను (young women) ఎక్కించుకుని రాత్రి వేళ రోడ్డు పైకి వస్తాడు. హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ఇద్దరు యువతులను ఎక్కించుకోవడం.. అది కూడా ముందొకరిని, వెనుక ఒకరిని ఎక్కించుకోవడం చూసి అంతా అవాక్కయ్యారు. చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుండడంతో రోడ్డుపై వెళ్లే మిగతా వాహనదారులంతా వీరినే చూస్తూ ఉన్నారు. బైకును కాసేపు మామూలుగానే నడిపిన యువకుడు.. తర్వాత ముందు చక్రాన్ని పైకి లేపి (Bike stunts) నడిపాడు. అలా నడపొద్దని వారించాల్సిన యువతులు.. అందుకు విరుద్ధంగా ఈలలు, కేకలు వేస్తూ అతన్ని మరింత ప్రోత్సహించారు.

Viral Video: అయ్యయ్యో.. వరి చేలో ఈ భార్యాభర్తలు ఇలా దొరికిపోయారేంటి..? ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీయడంతో..

దీంతో సదరు యువకుడు చాలా దూరం వేగంగా అలాగే నడపడం చూసి వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వారు మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బైకు ఏమాత్రం అదుపు తప్పినా పెద్ద ప్రమాదం జరిగుండేది. ఈ ఘటన మొత్తం ఇంకో వాహనంలో వెళ్తున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవడంతో (Viral video) ముంబై ట్రాఫిక్ పోలీసుల (Mumbai Traffic Police) దృష్టికి వెళ్లింది. వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా చేస్తూ.. ఈ ఘటన బీకేసీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, సదరు యువకుడి కోసం గాలిస్తున్నామని, ఎవరికైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని పేర్కొన్నారు. కాగా, వీరి నిర్వాకంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Bride Video: పెళ్లి ఫొటోల కోసం సరదాగా ఇలా ఫోజులు పెట్టడమే ఈ వధూవరుల కొంపముంచింది.. అప్పటిదాకా హ్యాపీగానే ఉన్నారు కానీ..

Updated Date - 2023-04-02T15:39:32+05:30 IST