Marriage: యాక్సిడెంట్‌లో మొదటి భర్త చనిపోవడం వల్ల వచ్చే పరిహారానికి రెండో పెళ్లి చేసుకున్న భార్య అర్హురాలేనా..? హైకోర్టు ఏం తేల్చిందంటే..

ABN , First Publish Date - 2023-04-02T18:12:31+05:30 IST

కుటుంబ యజమాని ఉన్నంత వరకూ ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ ఎప్పుడైతే యజమాని చనిపోతాడో.. అప్పటి నుంచి ఎక్కడ లేని సమస్యలు వచ్చిపడుతుంటాయి. ప్రధానంగా ఆస్తి విషయంలో గొడవలు మొదలవుతుంటాయి. భర్త చనిపోయిన సందర్భంలో..

Marriage: యాక్సిడెంట్‌లో మొదటి భర్త చనిపోవడం వల్ల వచ్చే పరిహారానికి రెండో పెళ్లి చేసుకున్న భార్య అర్హురాలేనా..? హైకోర్టు ఏం తేల్చిందంటే..

కుటుంబ యజమాని ఉన్నంత వరకూ ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ ఎప్పుడైతే యజమాని చనిపోతాడో.. అప్పటి నుంచి ఎక్కడ లేని సమస్యలు వచ్చిపడుతుంటాయి. ప్రధానంగా ఆస్తి విషయంలో గొడవలు మొదలవుతుంటాయి. భర్త చనిపోయిన సందర్భంలో అతడి భార్యతో సహా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్ల మధ్య ఆస్తి తగాదాలు చోటు చేసుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే భర్త యాక్సిడెంట్‌లో చనిపోయిన సందర్భంలో వచ్చే పరిహారానికి.. రెండో వివాహం చేసుకున్న భార్య అర్హురాలేనా..? ఈ సందేహం అందరికీ రావచ్చు. అయితే ఇలాంటి కేసుపై ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

రోడ్డు ప్రమాదాల్లో భర్త చనిపోయిన సందర్భంలో వచ్చే పరిహారానికి రెండో వివాహం చేసుకున్న మృతుడి భార్య అర్హురాలేనా.. అన్న సందేహంపై ముంబై హైకోర్టు (Mumbai High Court) క్లారిటీ ఇచ్చింది. 2010 నమోదైన ఓ కేసుపై హైకోర్టులో ఇటీవల వాదోపవాదాలు జరిగాయి. 2010 మే 15న గణేష్ అనే వ్యక్తి.. తన స్నేహితుడు సుఖ్‌రామ్‌తో కలిసి బైకుపై వెళ్తున్నాడు. ముంబై-పూణే రహదారిపై కామ్‌షెట్ వైపు వెళ్తుండగా వీరి బైకును ఆటో (auto hit a bike) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గణేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో గణేష్ భార్య రెండో వివాహం కూడా చేసుకుంది.

Bride Video: పెళ్లి ఫొటోల కోసం సరదాగా ఇలా ఫోజులు పెట్టడమే ఈ వధూవరుల కొంపముంచింది.. అప్పటిదాకా హ్యాపీగానే ఉన్నారు కానీ..

మృతుడి భార్యకు పరిహారం ఇవ్వాలని మోటర్‌ యాక్సిడెంట్స్‌ క్లెయిమ్‌ ట్రిబ్యునల్‌ (motor accidents claims tribunal) గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఇన్సూరెన్స్‌ కంపెనీ వారు బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మృతుడి భార్య రెండో వివాహం చేసుకున్నారనే కారణం చూపుతూ పరిహారం పొందే అర్హత లేదని ఇన్సూరెన్స్‌ కంపెనీ (Insurance Company) వాదించింది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం.. వితంతువుకు నష్ట పరిహారం చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెతో పాటూ మరో ముగ్గురు హక్కుదారులకు కలిపి మొత్తం రూ.10లక్షల పరిహారం (Compensation) చెల్లించాలని ఆదేశించింది. చనిపోయిన భర్త పరిహారం కోసం భార్య జీవితాంతం వితంతువుగా ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది.

Metro Train Video: బాబోయ్.. ఇదేం అరాచకం.. ఈ యువతి డ్రస్సు వేసుకుపోవడం మర్చిపోయి మెట్రో రైల్ ఎక్కిందా ఏంటి..? నెటిజన్ల ఘాటు కామెంట్స్..!

Updated Date - 2023-04-02T18:12:31+05:30 IST