Viral Video: క్లాస్‌రూమ్‌లో అంతా చూస్తుండగా లవ్ ప్రపోజ్.. ఆ యువతి రెస్పాన్స్ చూసి బిత్తరపోయిన కుర్రాడు.. మరుక్షణమే..!

ABN , First Publish Date - 2023-04-05T16:12:07+05:30 IST

ప్రేమికుల మధ్య చోటు చేసుకునే చిన్న చిన్న ఘటనలు కొన్నిసార్లు అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా కొందరు మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతుంటారు. వీటిలో కొన్ని ప్రేమలు ఆకర్షణతో మొదలవుతుండగా.. మరికొన్ని ప్రేమలు..

Viral Video: క్లాస్‌రూమ్‌లో అంతా చూస్తుండగా లవ్ ప్రపోజ్.. ఆ యువతి రెస్పాన్స్ చూసి బిత్తరపోయిన కుర్రాడు.. మరుక్షణమే..!

ప్రేమికుల మధ్య చోటు చేసుకునే చిన్న చిన్న ఘటనలు కొన్నిసార్లు అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా కొందరు మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతుంటారు. వీటిలో కొన్ని ప్రేమలు ఆకర్షణతో మొదలవుతుండగా.. మరికొన్ని ప్రేమలు అభిప్రాయాలు, అభిరుచులు కలవడం వల్ల మొదలవుతుంటాయి. అయితే ఇంకొన్ని ప్రేమలు.. చివరకు ఒన్ లైడ్ లవ్ గానే మిగిలిపోతుంటాయి. చాలా మంది యువతులు ప్రేమ విషయంలో ఎంతో కఠినంగా ఉంటారు. ఎన్ని రకాలుగా లవ్ ప్రపోజ్ చేసినా, వారు మాత్రం ఒకే మాట మీద ఉంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి క్లాస్‌రూమ్‌లో అంతా చూస్తుండగా యువతికి లవ్ ప్రపోజ్ చేస్తాడు. చివరకు ఆమె ఇచ్చిన రెస్పాన్స్ చూసి బిత్తరపోయాడు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral Videos) అవుతోంది. ఓ యువకుడు క్లాస్‌రూంలోకి రోజా పువ్వు తీసుకుని వెళ్తాడు. యువతికి (young woman) అందరి ముందూ లవ్ ప్రపోజ్ (Love proposal) చేయాలని అనుకుంటాడు. పువ్వును వెనుక వైపు దాచుకుని యువతి వద్దకు వెళతాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా పువ్వును తీసి ఆమెకు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఐ లవ్ యూ... అని నోటి నుంచి ఇలా మాట వచ్చిందో రాలేదో.. యువతికి కోపం కట్టలు తెంచుకుంటుంది.

Viral Video: ఉన్నట్టుండి పెళ్లికి ముందు వీడియో ప్రదర్శించగానే అవాక్కైన వధువు.. పెళ్లి మంటపంలో బిగ్ స్క్రీన్‌పై అంతా చూస్తుండగా..

‘‘ఎలా కనపడుతున్నా నీకు’’.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పువ్వును లాగి పక్కన పడేసే ప్రయత్నం చేస్తుంది. దీంతో అవమానంగా భావించిన అతను.. ఆమెపై దాడి చేయాలని చూస్తాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువతి.. పక్కనే ఉన్న బ్యాగు తీసుకుని అతడి పైకి విసిరి కొడుతుంది. వెళ్లు ఇక్కడి నుంచి.. అంటూ గట్టిగా మందలిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. వామ్మో! రిప్లై ఘాటుగా ఇచ్చిందిగా.. అంటూ కొందరు, ఇంకోసారి ఇంకెవరికీ లవ్ ప్రపోజ్ చెయ్యడు అనుకుంటా.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మెట్రో ట్రైన్లోంచి దిగిన వెంటనే ఓ యువతి వింత చేష్టలు.. అమ్మా.. తల్లీ.. నువ్విలా అందరినీ భయపెట్టొద్దంటూ నెట్టింట ఫన్నీ సెటైర్లు..!

Updated Date - 2023-04-05T16:12:07+05:30 IST