Viral Video: షాపింగ్ మాల్‌కు వెళ్లగానే మొదటగా చేసే పనేంటి..? సరుకులకై ట్రాలీని తీసుకునే వాళ్లు తప్పక చూడాల్సిన వీడియో..!

ABN , First Publish Date - 2023-04-06T16:33:49+05:30 IST

షాపింగ్ సమయంలో చూడగానే అన్నీ తీసుకోవాలి అనిపిస్తుంటుంది. కానీ చివరగా వాటిని మోసుకెళ్లాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడే.. ‘‘ఈ షాపింగ్ నా ప్రాణం మీదకు వచ్చిందిరా బాబూ’’ అని అనిపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్లినప్పుడు..

Viral Video: షాపింగ్ మాల్‌కు వెళ్లగానే మొదటగా చేసే పనేంటి..? సరుకులకై ట్రాలీని తీసుకునే వాళ్లు తప్పక చూడాల్సిన వీడియో..!

షాపింగ్ సమయంలో చూడగానే అన్నీ తీసుకోవాలి అనిపిస్తుంటుంది. కానీ చివరగా వాటిని మోసుకెళ్లాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడే.. ‘‘ఈ షాపింగ్ నా ప్రాణం మీదకు వచ్చిందిరా బాబూ’’ అని అనిపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్లినప్పుడు.. మనకు కావాల్సిన సరుకులను ట్రాలీల్లో వేసుకోవడం, చివరగా బిల్లు చెల్లించి.. వాటిని మోసకెళ్లడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. అరే! ఇదేదో బాగుందే.. ఇలాంటి ట్రాలీతో షాపింగ్ చేస్తే ఎంత బాగుంటుంది.. అని అనిపిస్తుంది. సరుకులకై ట్రాలీని తీసుకునే వాళ్లు ఈ వీడియో చూస్తే మాత్రం షాకవడం ఖాయం..

సోషల్ మీడియాలో ఓ ట్రాలీ వాహనానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. షాపింగ్ చేసినప్పుడు ట్రాలీని (Shopping trolley) వాహనంగా ఉపయోగించడం రొటీన్. కానీ సరుకులతో పాటూ మనుషులను కూడా ట్రాలీనే మోసుకెళ్తే ఎలా ఉంటుంది. ఓ వ్యక్తికి ఇదే ఐడియా వచ్చింది. వెంటనే ట్రాలీ ఆకారంలో ఉన్న ఓ పెద్ద వాహనాన్ని తయారు చేశాడు. నాలుగు చక్రాల మీద అచ్చం షాపింగ్ ట్రాలీ తరహాలో ఉన్న ఈ వాహనాన్ని (shopping trolley vehicle) చూసి అంతా షాక్ అవుతున్నారు.

Husband Love Letter: ఇంటిని శుభ్రం చేస్తోంటే బయటపడ్డ ‘భర్త లవ్ లెటర్’.. 18 ఏళ్ల క్రితం నాటి ఆ లేఖను చదివి ఆ భార్య ఏం చేసిందంటే..

ట్రాలీలో ఒక ఊరికి సరిపడా సరుకులన్నింటినీ మోసుకెళ్లే సామార్థం ఉంటుంది. వెనుక వైపు సీట్లో కూర్చున్న వ్యక్తి వాహనాన్ని స్టీరింగ్‌తో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈ వాహనం పక్కనే కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సుమారు 15 సెకన్ల నిడివి గల వీడియో లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘షాపింగ్ వెళ్లినప్పుడు మేము కూడా ఇలాంటి వాహనంలో వెళ్లాలని అనుకుంటున్నాం’’.. అని కొందరు, ఆహా! ఇలాంటి ఓపెన్ ఎయిర్ డ్రైవింగ్ చేస్తే ఎంత బాగుంటుంది’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Videos: ఓరి నాయనో.. మెట్రో రైళ్లలో ఇన్ని కళాఖండాలా..? డ్రస్సుల నుంచి ముద్దు సీన్ల వరకు ఎన్ని నిర్వాకాలు జరిగాయో మీరే చూడండి..!

Updated Date - 2023-04-06T16:33:49+05:30 IST