Viral Video: మాయలు మంత్రాలు వచ్చా ఏంటంటూ ఉలిక్కి పడిన కొలీగ్.. ఖాళీ కవర్లోంచి ఇన్ని ఐటమ్స్ ఎలా వచ్చాయో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-04-07T21:25:49+05:30 IST

కొందరు చేసే మ్యాజిక్ చూస్తే.. వీరికేమైనా మానవాతీత శక్తులేమైనా ఉన్నాయా అని అనిపిస్తుంది. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా వారి ఇంద్రజాలం ఉంటుంది. వస్తువులను గాల్లోకి లేపడం, కోటు నుంచి పావురాలను తీయడం, కర్ర నుంచి పూలు బయటకు రావడం.. ఆఖరికి..

Viral Video: మాయలు మంత్రాలు వచ్చా ఏంటంటూ ఉలిక్కి పడిన కొలీగ్.. ఖాళీ కవర్లోంచి ఇన్ని ఐటమ్స్ ఎలా వచ్చాయో మీరే చూడండి..!

కొందరు చేసే మ్యాజిక్ చూస్తే.. వీరికేమైనా మానవాతీత శక్తులేమైనా ఉన్నాయా అని అనిపిస్తుంది. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా వారి ఇంద్రజాలం ఉంటుంది. వస్తువులను గాల్లోకి లేపడం, కోటు నుంచి పావురాలను తీయడం, కర్ర నుంచి పూలు బయటకు రావడం.. ఆఖరికి ఏకంగా మనిషినే ముక్కలుగా చేయడం వంటివి చూసేవారిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. వీళ్లకేమైనా మాయలు, మంత్రాలేమైనా వచ్చా.. అని అనిపించేలా అందరినీ నమ్మిస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. ఖాళీ కవర్లోంచి ఓ వ్యక్తి చాలా ఐటమ్స్‌ని బయటికి తీయడం చూసి అతడి కొలీగ్ ఉలిక్కిపడ్డాడు..

సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన మ్యాజిక్ వీడియో తెగ వైరల్ (Magic Viral Videos) అవుతోంది. ఆఫీసులో టేబుల్ వద్ద ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉంటారు. కాసేపటికి అక్కడికి ఓ యువకుడు (young man) చేతిలో ఖాలీ పేపర్ బ్యాగ్‌ని (Paper bag) పట్టుకుని వస్తాడు. నేరుగా వచ్చి వారి మధ్యలో కూర్చుంటాడు. ముందుగా పేపర్ బ్యాగ్‌ని ఓపెన్ చేసి, అందులో నుంచి ముందుగా ఓ ప్యాకెట్‌ని బయటికి తీస్తాడు. తర్వాత మళ్లీ టీ కప్‌ని (Tea cup) తీసి పక్కన పెడతాడు. అనంతరం ఓ ప్లాస్టిక్ బాక్స్‌ని తీస్తాడు. చివరగా ఓ నీళ్ల బాటిల్‌ని పక్కన పెడతాడు. దీన్నంతా గమనిస్తున్న పక్కన ఉన్న కొలీగ్.. వామ్మో! అంటూ ఉలిక్కిపడతాడు.

CCTV Video: రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సీన్.. రైలు కింద పడేందుకు దూకిన యువతి.. పక్కనే నిల్చున్న కుర్రాడు చేయి పట్టుకుని లాగాడు కానీ..

అయితే వీడియో చూసే వాళ్లకు మొదట్లోనే అసలు విషయం అర్థమవుతుంది. పేపర్ బ్యాగుకు ఓ వైపు పెద్ద రంధ్రం చేసి ఉంటుంది. టేబుల్‌పై పెట్టినప్పుడు రంధ్రం కనపడకుండా జాగ్రత్తపడతాడు. అతడికి ఇటు పక్క కూర్చున్న వ్యక్తి.. వస్తువులను రంధ్రం గుండా అందిస్తూ ఉంటాడు. అటువైపు కూర్చున్న వ్యక్తికి మాత్రం ఖాళీ బ్యాగు నుంచి వస్తువులు తీస్తున్నట్లు మాత్రమే కనపడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వావ్!.. టెక్నిక్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Married Couple: పెళ్లయిన 3 గంటలకే షాకింగ్ సీన్.. ఈ వధూవరులు పోలీస్ స్టేషన్ ముందు ఎందుకిలా కూర్చోవాల్సి వచ్చిందంటే..!

Updated Date - 2023-04-07T21:25:49+05:30 IST