ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెటిజన్ల మనసు గెలుచుకున్న బార్బర్.. మహిళకు గుండు కొట్టిన అతను.. కారణం తెలుసుకుని చివరకు ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2023-03-25T21:27:41+05:30

కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయకపోగా.. కనీసం సానుభూతి కూడా చూపని రోజులివి. ఎదుటి మనిషి ఇబ్బంది పడుతుంటే.. అయ్యో పాపం.. అనే వారి కంటే ఆనందించే వారే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి ఈ సమాజంలో అప్పుడప్పుడూ కొందరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయకపోగా.. కనీసం సానుభూతి కూడా చూపని రోజులివి. ఎదుటి మనిషి ఇబ్బంది పడుతుంటే.. అయ్యో పాపం.. అనే వారి కంటే ఆనందించే వారే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి ఈ సమాజంలో అప్పుడప్పుడూ కొందరు.. ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపిస్తుంటారు. ఇందుకు సాక్ష్యంగా అనేక ఘటనలు మన కళ్ల ముందే చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే సోషల్ మీడియాలోనూ పలు వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. మహిళకు గుండు కొట్టిన బార్బర్.. చివరకు కారణం తెలుసుకుని కంటతడి పెట్టాడు. చివరకు అతడు చేసిన పని చూసి అంతా కన్నీటిపర్యంతమవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ బార్బర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ (Barber viral videos) అవుతున్నాయి. ఓ మహిళ (woman) గుండు కొట్టించుకునేందుకు సెలూన్‌కి వెళ్తుంది. ఆమె గుండు కొట్టే క్రమంలో బార్బర్‌కు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. కేన్సర్‌తో (Cancer) బాధపడుతున్న మహిళ.. కిమోథెరపీ (Chemotherapy) కోసం గుడ్డు కొట్టించుకోవాల్సి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బార్బర్ తీవ్ర భావోద్వోగానికి లోనవుతాడు. మహిళ ఏడుస్తూ ఉండడాన్ని చూసి చలించిపోతాడు.

Viral Video: బుడ్డోన్ని డబ్బాలో మూసేసి.. అలా తోశావేంట్రా.. చివరకు ఏమైందో చూడండి..

ఆమెను ఓదారుస్తూనే గుండు కొడతాడు. అయితే చివరగా తాను కూడా గుడ్డు కొట్టుకుంటాడు. దీన్ని గమనించిన సదరు మహిళ అయ్యో! ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదే.. అనుకుంటూ కుమిలిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు (Viral photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళపై సానుభూతి చూపిస్తూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. బార్బర్ మంచి మనసును మెచ్చుకుంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral news: టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు.. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కాసేపటికి ప్రియుడు వెళ్లి చూడగా..

Updated Date - 2023-03-25T21:27:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising