Viral Video: వార్నీ.. ఏం ఐడియా తల్లీ.. హై హీల్స్‌ను ఇలా కూడా వాడొచ్చా.. వీడియో వైరల్!
ABN, Publish Date - Dec 22 , 2023 | 06:08 PM
బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గుతుందనేది ఓ సినిమాలో డైలాగ్. చాలా మంది తమ మెదడును ఉపయోగించి కష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ క్రియేటివిటీతో ఎంతో మందిని ఫిదా చేస్తారు.
బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గుతుందనేది ఓ సినిమాలో డైలాగ్. చాలా మంది తమ మెదడును ఉపయోగించి కష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ క్రియేటివిటీతో (Creative Videos) ఎంతో మందిని ఫిదా చేస్తారు. అలాంటి జుగాడ్ వీడియోలు (Jugaad Videos) ఇటీవలి కాలంలో సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆ మహిళల తెలివి తేటలను ప్రశంసిస్తున్నారు.
@Enezator అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ హై హీల్స్ (High Heels) వేసుకుని పొలంలో నిల్చుంది. ఆమె హీల్ మోపిన చోట చిన్న రంధ్రం పడుతోంది. వెనక ఉన్న మరో మహిళ ఆ రంధ్రంలో విత్తానాలు వేస్తోంది. అలా ఆ ఇద్దరూ హీల్స్ ఉపయోగించి పొలంలో విత్తనాలు వేస్తున్నారు. వారి క్రియేటివిటీ చాలా మందిని ఆకట్టుకుంటోంది. అలాగే చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 82 లక్షల మందికి పైగా వీక్షించారు.
Viral Video: రైలులో హీరో అవ్వాలని ప్రయత్నించాడు.. చివరకు ఎలా పరువు పోగొట్టుకున్నాడో చూడండి..
ఈ జుగాడ్ వీడియోను 22 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``వాళ్ల క్రియేటివిటీ పీక్స్‌లో ఉంది``, ``సరికొత్త ఆలోచనా విధానం``, ``గొప్ప ఆలోచన``, ``హీల్స్‌ను ఇప్పటివరకు ఇంత గొప్పగా ఎవరూ ఉపయోగించి ఉండరు``, ``ఈ టెక్నాలజీ అద్భుతం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - Dec 22 , 2023 | 06:08 PM