Viral Video: రైలులో హీరో అవ్వాలని ప్రయత్నించాడు.. చివరకు ఎలా పరువు పోగొట్టుకున్నాడో చూడండి..
ABN , Publish Date - Dec 22 , 2023 | 05:56 PM
భారతీయ రైళ్లు ప్రతిరోజూ కొన్ని కోట్ల మందిని తమ తమ గమ్య స్థానాలకు చేరుస్తాయి. ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసి పోయి నడుస్తుంటాయి. దాదాపు చాలా రైళ్ల జనరల్ భోగీలు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి.
భారతీయ రైళ్లు (Indian Railway) ప్రతిరోజూ కొన్ని కోట్ల మందిని తమ తమ గమ్య స్థానాలకు చేరుస్తాయి. ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసి పోయి నడుస్తుంటాయి. దాదాపు చాలా రైళ్ల (Trains) జనరల్ భోగీలు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. ఆయా భోగీల్లో సీటు సంపాదించేందుకు, ఎలాగోలా చోటు దక్కించుకునేందుకు ప్రయాణికులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి ఆ ఫీట్లు నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral Video) చూస్తే నవ్వు రాక మానదు.
@Bihar_se_hai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. బీహార్‌లో (Bihar) ప్రయాణిస్తున్న రైలులో ఆ ఘటన జరిగింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రైలు భోగీ ప్రయాణికులతో నిండిపోయింది. ఒక ప్రయాణికుడికి సీటు దొరకలేదు. దీంతో ఆ వ్యక్తి ఓ వెరైటీ ప్లాన్ వేశాడు. భోగీలోని రెండు అప్పర్ బెర్త్‌లను కలుపుతూ ఓ వస్త్రం కట్టాడు. అందులో కూర్చున్నాడు. అయితే అతడు బరువును ఆ వస్త్రం కాయలేకపోయింది. ముడి తెగిపోవడంతో ఆ వ్యక్తి పై నుంచి కింద పడ్డాడు. దీంతో చుట్టుపక్కల వారు నవ్వుకున్నారు (Funny Video).
ఓ వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫన్నీ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 95 వేల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. ఆ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేశారు. ``హీరో అవుదామనుకున్నాడు.. పరువు పోగొట్టుకున్నాడు``, ``ఇది డుంకీ సినిమాకు బీహార్ వెర్షన్``, ``అధిక తెలివి తేటలు ఉపయోగిస్తే ఇలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.